రాష్ట్రీయం

ప్రతికూలతలతోనే ఉక్కు మహిళగా ఇందిర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి కులం, మతం అనే భేదాభిప్రాయాలు ఉండేవి కాదని ఎఐసిసి నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం అన్నారు. ప్రతికూలతలే ఆమెను ఉక్కు మహిళగా చేసి విజయం వైపు నడిపించాయని ఆయన పేర్కొన్నారు. ఉక్కు మనిషిగా ఇందిరా గాంధీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఇందిరా గాంధీ శత జయంతి కమిటీ అధ్వర్యంలో సంవత్సరం పొడుగునా ‘ప్రజాస్వామ్యంలో ఇందిరా గాంధీ విప్లవాత్మక మార్పులు’ అనే అంశంపై నిర్వహిస్తున్న సదస్సుల్లో భాగంగా శనివారం టిపిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన పి. చిదంబరం ప్రసంగిస్తూ కుల, మతాలతో దేశం విడిపోకుండా ఇందిరా గాంధీ చూశారని అన్నారు. ఎమర్జెన్సీ విషయంలో రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ తాను చేసింది తప్పేనని ధైర్యంగా ఒప్పుకున్న ఉక్కు మనిషి ఇందిరా గాంధీ అని అన్నారు. హరిత విప్లవంతో దేశం స్వయం సమృద్ధి సాధించేలా చేశారని అన్నారు. మహాత్మా గాంధీ తర్వాత దేశ ప్రజలు గుర్తుంచుకునేది ఇందిరా గాంధీనేనని పేర్కొన్నారు. రెండు సార్లు యుద్ధాలు, కరవు కాటకాల నుంచి దేశాన్ని కాపాడారని ఆయన చెప్పారు. బడుగు బలహీనవర్గాల జీవితాల్లో వెలుగు నింపిన మహా మనిషి అన్నారు. కేంద్ర మాజీ మంత్రి అజయ్ మకెన్ ప్రసంగిస్తూ ఇందిరా గాంధీ 20 సూత్రాల పథకంతో విప్లవం సృష్టించారన్నారు.
భూ సంస్కరణలతో..: శాంతా సిన్హా
మెగసిసే అవార్డు గ్రహిత శాంతా సిన్హా ప్రధానోపన్యాసం చేస్తూ ఇందిరా గాంధీ చట్టాలు చేయకుంటే నేను ఫలితాలు సాధించలేకపోయేదాన్ని అని చెప్పారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఇందిర పోరాటం చేశారని, భూ సంస్కరణలతో కూలీలు యజమానులయ్యారన్నారు. 20 సూత్రాల ఆర్థిక పథకంతో కూలీలు, ఎస్‌సి, ఎస్‌టి, అట్టడుగు వర్గాల మహిళలతో సహా అన్ని వర్గాలకు చేరే విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.
మళ్లీ కనిపించలేదు: రామచంద్రమూర్తి
సాక్షి ఎడిటోరియల్ బోర్డు డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి ప్రసంగిస్తూ ఇందిరా గాంధీలాంటి నాయకురాలిని తాను మళ్లీ చూడలేదని అన్నారు. పేదరిక నిర్మూలన కోసం నిరంతరం కృషి చేశారని ఆయన చెప్పారు. బీహార్, యుపిలో దళితుల ఊచకోత జరిగితే హుటాహుటిన వెళ్ళారని ఆయన తెలిపారు. భూ సంస్కరణలతో దళితులకు లాభం జరిగిందని, వెట్టి చాకిరి నుంచి కాపాడారని ఆయన వివరించారు. సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య ప్రసంగిస్తూ ఇందిరా గాంధీ ప్రధాని కావడానికి ముందు వరకూ పాలన చేసిన వారంతా దేశ ఆర్థికాభివృద్ధి గురించి ఆలోచన చేశారే తప్ప అట్టడుగున వారి అభ్యున్నతి గురించి ఆలోచించలేదని అన్నారు.