ఆంధ్రప్రదేశ్‌

గంటా చెప్పినట్టు చేస్తే సరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 17: విశాఖ భూ కుంభకోణంపై బిజెపి శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ఈ మేరకు శనివారం ‘ఆంధ్రభూమి’తో మాట్లాడారు. గంటా శ్రీనివాసరావుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. విశాఖ భూముల కుంభకోణంలో అయ్యన్న వ్యాఖ్యలను ఉటంకిస్తూ సిఎం చంద్రబాబుకు గంటా లేఖ రాశారు. అందులో ఈ భూ కుంభకోణంపై సిబిసిఐడి, సిఐడి విచారణ జరిపించాలని చంద్రబాబుకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి మాటకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ వివాదంలో మంత్రి గంటా ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. సిబిఐ విచారణలో నిజా నిజాలు నిగ్గు తేలితే దోషులకు శిక్ష పడుతుంది. సిఎం చంద్రబాబు సిబిఐ విచారణను కోరాలని విష్ణుకుమార్ రాజు సూచించారు. సిబిఐ విచారణకు కేంద్రం నుంచి అనుమతి కావల్సి వస్తే, తను కేంద్ర పెద్దలతో మాట్లాడి, సిఐబి రంగంలోకి దిగేలా తన వంతు సహకారం అందిస్తానని విష్ణుకుమార్ రాజు చెప్పారు. ముదపాక భూముల వ్యవహారాన్ని సిబిఐతో విధిగా దర్యాప్తు జరిపిస్తేకానీ, తెర వెనుక ఉన్నవారి బండారం బయటపడదని ఆయన అన్నారు.