ఆంధ్రప్రదేశ్‌

ప్రధాన ఆలయాలకు త్వరలో పాలకమండళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 17: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు త్వరలోనే పాలక మండళ్లు ఏర్పాటు చేస్తామని దేవాదాయశాఖ మంత్రి పైడికొండ మాణిక్యాలరావు వెల్లడించారు. శనివారం గుంటూరులో రాష్ట్ర టిడిపి కార్యాలయంలో పార్టీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ వివివి చౌదరితో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకమండళ్ల ఏర్పాటులో తెలుగుదేశం, బిజెపి స్థానిక నేతల మధ్య అంతరాలు ఏర్పడుతున్నాయని, సమన్వయంతో పరిష్కరిస్తామన్నారు. ఆలయ పాలకవర్గాల నియామకంపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. త్వరలో తిరుమల తిరుపతి దేవస్థానం, దుర్గగుడి, శ్రీశైలం దేవస్థానాల పాలకవర్గాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. టిటిడి చైర్మన్ రేసులో తెలుగుదేశం పార్టీ ఎంపిలు రాయపాటి సాంబశివరావు, మురళీమోహన్ పోటీపడుతున్న నేపథ్యంలో పార్టీ నుంచి ఆశావహులు అధికంగా ఉన్నారని మాణిక్యాలరావు వ్యాఖ్యానించారు. అడిగే వారంతా సమర్థులే కావటంతో నియామకాల విషయంలో జాప్యం జరుగుతోందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 85 శాతం దేవాలయాలకు పాలకమండళ్లు ఏర్పాటయ్యాయని వివరించారు. టిటిడి చైర్మన్ విషయంలో తలెత్తిన పేచీపై సమావేశంలో చర్చించారు. టిటిడి చైర్మన్ పదవి తన చిరకాల వాంఛగా ఎంపి రాయపాటి ఎప్పటి నుంచో ఆ పదవిని ఆశిస్తున్నారు. అయితే ఇప్పటికే మురళీమోహన్‌కు ఖరారైందనే ప్రచారం ఆ పార్టీ వర్గాల ద్వారా జరుగుతోంది.