ఆంధ్రప్రదేశ్‌

ముగిసిన ఉపాధ్యాయ బదిలీల దరఖాస్తు గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 17: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల బదిలీల దరఖాస్తులకు గడువు ఎంతో శనివారం ముగిసింది. బదిలీ పరిధిలోకి వచ్చే ఒక లక్షా 62వేల 091 మందికి గాను విధిగా బదిలీ కావాల్సిన వారిలో 59వేల 568 మంది, రిక్వెస్ట్ బదిలీ కోసం 28వేల 625 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా అనేక జిల్లాల్లో రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తికాకపోవటంతో రేషనలైజేషన్ పరిధిలోకి వచ్చే పాఠశాలల ఉపాధ్యాయులు బదిలీ దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 25తేదీ వరకు గడువు పొడిగించినట్టు పాఠశాలల విద్యా కమిషనర్ వి.సంధ్యారాణి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక షెడ్యూలును ప్రకటించారు. 25-27 తేదీల్లో రేషనలైజేషన్ ప్రక్రియ జరుగుతుంది. కేటగిరి, సబ్జెక్టు, మీడియం వారీగా ఖాళీల జాబితాను 27న ప్రకటిస్తారు. జూలై 22 తేదీన బదిలీల జాబితాను ప్రకటిస్తారు. బదిలీ అయినవారు 24 తేదీ తమ తమ పాఠశాలల్లో చేరాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఉపాధ్యాయ బదిలీ నిబంధనలకు మరిన్ని సవరణలు తెస్తూ పాఠశాల విద్యా కమిషనర్ సంధ్యారాణి ఈనెల 16తేదీ ఆర్‌సి నెం.190తో ఉత్తర్వులు జారీ చేశారు. స్పౌజ్ పాయింట్లను 8 సంవత్సరాలకు బదులుగా 8 అకడమిక్ సంవత్సరాలను పరిగణనలోకి తీసుకుంటారు. రేషనలైజేషన్‌లో ఒక పాఠశాలలోని పోస్టును బదిలీ చేసే సందర్భంలో ఆ పాఠశాలలో 2017 జూన్ 30 తేదీకి పదవీ విరమణ చేసే ఉపాధ్యాయుడు ఉంటే ఆ పోస్టును బదిలీ చేస్తారు. 610 జీవో ప్రకారం జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా బదిలీ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధానోపాధ్యాయునిగా అదనపు బాధ్యతలు నిర్వహించిన స్కూల్ అసిస్టెంట్‌కు హెచ్‌ఎంగా ఇచ్చే ప్రాధాన్యత మార్కులు కేటాయిస్తారు. 2015లో కొన్ని పాఠశాలలు విలీనమయ్యాయి. ఆ పాఠశాలలోని ఉపాధ్యాయుల స్కూల్ సర్వీస్‌ను రేషనలైజేషన్‌లో నూతన పాఠశాల నుంచి లెక్కిస్తారు. భాషా పండితులు, పిఇటిల పోస్టులు ఖాళీలు లేని సందర్భంగా మిగులు భాషా పండితులు, పిఇటిలను అవసరమైన పాఠశాలలకు కౌన్సిలింగ్ విధానంలో సర్దుబాటు చేస్తారు. వారి జీతాలు ఖాళీగా ఉన్న క్రాఫ్ట్, డ్రాయింగ్, సెకండరీ గ్రేడ్ పోస్టు నుంచి చెల్లిస్తారు. అప్‌గ్రేడ్ అయిన స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు అదనపు పోస్టులుగా గుర్తిస్తే వాటిని 400 లోపు విద్యార్థులు గల పాఠశాలలకు అవరోహణ క్రమంలో సర్దుబాటు చేస్తారు. ఇన్‌స్పైర్ అవార్డులకు రాష్ట్ర, జాతీయ ప్రాధాన్యత పాయింట్లు ఐదు సంవత్సరాలు లేదా 8 అకడమిక్ సంవత్సరాల్లో ఒకసారి వాడుకోవచ్చు. ఏది ఏమైనా పోరాటాల ద్వారా బదిలీ ఉత్తర్వుల్లో కొన్ని సవరణలు తీసుకురాగల్గామని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐ.వెంకటేశ్వరరావు, పి.బాబురెడ్డి ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు.