ఆంధ్రప్రదేశ్‌

మట్టిలో కలుస్తున్న ప్రాచీన శిల్పసంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 17: పాలకుల నిర్లక్ష్యం.. ప్రజల అవగాహన రాహిత్యం.. వెరసి అపురూపమైన శిల్పసంపద శిథిలమవుతోంది. శ్రీశైలం తూర్పు ద్వారంగా పేరుగాంచిన ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఎటు చూచినా శిథిల ఆలయాలు, విరిగిన శిల్పాలు, రూపుకోల్పోతున్న శాసనాలే కనిపిస్తున్నాయి. త్రిపురాంతకేశ్వర దేవాలయ సముదాయం, కిందున్న బాలాత్రిపుర సుందరి ఆలయాలు తప్ప, పంచలింగాలు, చెన్నకేశవాలయం, సప్త మాతృక ఆలయాలు ఆలనా పాలనా లేక కునారిల్లుతున్నాయి. పట్టించుకునే నాథుని కోసం ఎదురు చూస్తున్నాయి. వారసత్వాన్ని కాపాడి భవిష్యత్తరాలకు అందించటాన్ని ఉద్దేశించిన ‘ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టరిటీ’ పథకంలో భాగంగా కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి సిఈవో ఈమని శివనాగిరెడ్డి శనివారం త్రిపురాంతక పరిసరాల్లో సర్వే జరిపి, అనేక చారిత్రక ఆనవాళ్లను గుర్తించారు. వాటిలో శివాలయం మట్టిలో కూరుకుపోగా, దాని ముందున్న క్రీ.శ. 10వ శతాబ్దినాటి నంది విగ్రహం మీద అధికారులు రోడ్డేయగా, నంది విగ్రహం పైనుంచే యథేచ్ఛగా వాహనాలు వెళ్లటం విస్తుపోయేట్టు చేసింది. త్రిపురాంతకం నుంచి యర్రగొండపాలెం వెళ్లే రోడ్డు విస్తరణలో అపురూప నంది విగ్రహం బలైపోయిందని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రుల చరిత్ర, సంస్కృతికి ఆనవాళ్లయిన శిల్పసంపద నిర్లక్ష్యానికి గురవుతోందని, దానిని కాపాడి భావితరాలకు అందించాలని, దేవాదాయ, పురావస్తుశాఖ అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

చిత్రం.. క్రీ.శ. 10వ శతాబ్ది నాటి నంది విగ్రహం మట్టిలో కూరుకుపోగా, దానిమీదే రోడ్డు వేసిన దృశ్యం.