ఆంధ్రప్రదేశ్‌

ఎంత చేసినా మెప్పించలేకపోతున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 17: ‘రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా మనం వేల కోట్లు ఖర్చు చేసి, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాం. అయినా ప్రజల్లో సంతృప్తి పెరగడం లేదు. నేనేమో పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని నిరంతరం కష్టపడుతుంటే మీరేమో నిరంతరం గొడవలు, వివాదాల్లో మునిగిపోతున్నారు. ఇలాగైతే ఇక నేనే కఠిన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. పనిచేయని వారికి మళ్లీ టికెట్లు ఇచ్చే సమస్యేలేదు.
దాన్నిబట్టి మీరు పనిచేయండ’ని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ నేతలను హెచ్చరించారు. శనివారం తన నివాసంలో జరిగిన అనంతపురం జిల్లా పార్టీ సమీక్షా సమావేశంలో ఆయన పార్టీ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎంపి జెసి దివాకర్‌రెడ్డి వ్యవహారశైలిపై మాట్లాడిన బాబు, ప్రజాజీవితంలో ఉన్నవాళ్లు జాగ్రత్తగా వ్యవహరించాలని, లేకపోతే పార్టీ దెబ్బతింటుందని హెచ్చరించారు. జెసి వ్యాఖ్యలపై ఎవరూ మాట్లాడవలసిన పనిలేదన్నారు. మనం ఆర్థికంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్నా, పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి చేస్తున్న విమర్శలను తిప్పికొట్టకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం ఎన్ని మంచి పనులు చేస్తున్నా ప్రజల్లో సంతృప్తి శాతాన్ని పెంచలేకపోతున్నాం. ఇది మంచిదికాదు. మీరంతా దానిపై దృష్టి సారించాలని ఆదేశించారు.
కాగా రెండున్నరేళ్ల ఒప్పందం ముగిసినా జడ్పీ చైర్మన్ చమన్ ఇంకా రాజీనామా ఎందుకు చేయలేదని బాబు ప్రశ్నించగా, కొన్ని పెండింగ్ పనులున్నాయని, ఈనెలలో రాజీనామా చేస్తానని చమన్ బదులిచ్చారు. దానితో గత ఒప్పందం ప్రకారం నాగరాజును జడ్పీ చైర్మన్‌గా ఎంపిక చేశారు. అదేవిధంగా పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్‌గా పిసి గంగన్న స్థానంలో చలపతిని నియమించాలని నిర్ణయించారు.

చిత్రం.. అనంతపురం జిల్లా నేతలతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు