కృష్ణ

రెపరెపలాడిన అరుణ పతాకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), మే 1: ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలను ఆదివారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన మే డే వేడుకల్లో అరుణ పతాకాలు రెపరెపలాడాయి. ఎవరికి వారు పట్టణంలో భారీ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించి అరుణ పతాకాలను ఎగురవేసి మేడే విశిష్ఠతను తెలియజేశారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లారుూస్ యూనియన్ (ఐసిఇయు) ఆధ్వర్యంలో స్థానిక ఎల్‌ఐసి డివిజన్ కార్యాలయం వద్ద నిర్వహించిన మేడే వేడుకల్లో ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. అంతర్జాతీయ కార్మిక వర్గ దినోత్సవం కార్మికుల హక్కుల కోసం జరిగే దినోత్సవమని పేర్కొన్నారు. కార్మిక చట్టాలలో మార్పులు వంటి అంశాలు ముందుకొస్తున్న తరుణంలో విశాల ఐక్యత ఆవశ్యకత ఉందన్నారు. రాబోయే రోజుల్లో కార్మిక వర్గం మరింత సంఘటితంగా ఉద్యమాలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తొలుత ఎఐఐఇఎ పతాకాన్ని స్థూపం వద్ద ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసిఇయు ప్రధాన కార్యదర్శి జి కిషోర్‌కుమార్, నాయకులు టి చంద్రపాల్, ఎన్ సుబ్రహ్మణ్యం, ఆర్ సత్తార్ సాహెబ్, ఎస్‌వి రత్నారావు, కార్మికులు పాల్గొన్నారు. స్థానిక 15వ వార్డులో వడ్రంగి పనివారల సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మేడే స్థూపం వద్ద జరిగిన కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి పిఆర్ రాజీవ్, మరో న్యాయమూర్తి విఎస్‌ఎస్ శ్రీనివాస శర్మ మాట్లాడుతూ అసంఘటిత కార్మికుల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, సీనియర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కూనపరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో పట్టణంలోని 37 సెంటర్లలో మేడే వేడుకలను నిర్వహించారు. ఎఐఎఫ్‌టియు, రైతు కూలీ సంఘం, సిపిఐ(ఎంఎల్) ఆధ్వర్యంలో కాలనీలు, పేటలు, కార్మిక వాడల్లో, మండల పరిధిలోని చిన్నాపురం ఏరియా గ్రామాల్లో కార్మిక దీక్షా దినం మేడే సందర్భంగా ఎర్రజెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో ఎఐఎఫ్‌టియు నాయకులు ముచ్చు సుధాకరరావు, బెల్లంకొండ సురేష్, రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జె జగన్, జిల్లా నాయకులు కొప్పినేని ఉమామహేశ్వరరావు, కొక్కిలిగడ్డ నాగేశ్వరరావు, స్ర్తివిముక్తి సంఘటన జిల్లా ఉపాధ్యక్షురాలు పామర్తి అంజమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ఎఐటియుసి ఆధ్వర్యంలో..
ఎఐటియుసి ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఏరియా సిపిఐ కార్యదర్శి యర్రంశెట్టి ఈశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు దేవనక్తుని నిర్మల అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎఐటియుసి జిల్లా కార్యదర్శి లింగం ఫిలిఫ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మేడే విశిష్ఠతను వివరించారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద సిపిఐ నాయకురాలు డి నిర్మల అరుణ పతాకాన్ని ఎగురవేశారు. ఎఐటియుసి పతాకాన్ని లింగం ఫిలిప్, మెడికల్ యూనియన్ పతాకాన్ని కోన అప్పారావు అవిష్కరించారు. బెల్లంకొట్ల సందులో బిల్డింగ్ మెయింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో సంఘ గౌరవాధ్యక్షులు, సీనియర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజి అరుణ పతకాన్ని ఎగురవేశారు. అనంతరం పట్టణ పెయింటర్స్ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బండారు శ్రీనివాసరావు, కార్యదర్శి కెనడి మునియ్య, కోశాధికారి మాచర్ల ప్రేమ్‌కుమార్, ఉపాధ్యక్షులు ఇ ఏడుకొండలు, సంయుక్త కార్యదర్శి కె శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కోనేరుసెంటరు క్లాత్ బజార్‌లో కామ్రెడ్ సయ్యద్ అబ్దుల్లా స్థూపం వద్ద ఎర్రజెండాను రాష్ట్ర కార్యదర్శి కామ్రెడ్ యద్దనపూడి సోని ఆవిష్కరించారు. అబ్దుల్లా కుమారుడు సయ్యద్ పీర్ పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బాజి, షేరాలి, అమీర్, ఇమాం, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్ సిపి ఆధ్వర్యంలో..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లక్ష్మీ టాకీసు సెంటరులో మేడే వేడుకలు జరిగాయి. మున్సిపల్ మాజీ చైర్మన్, వైసిపి పట్టణ అధ్యక్షులు సలార్ దాదా అరుణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాదివాడ రాము, వంకా వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

టిడిపి హయాంలోనే కార్మికులకు విస్తృత ప్రయోజనాలు
విజయవాడ (కార్పొరేషన్), మే 1: రాష్ట్రంలో కార్మికుల అభ్యున్నతికి టిడిపి ప్రభుత్వం విస్తృత చర్యలు తీసుకుంటోందని, ప్రమాదబీమాతోపాటు 43శాతం ఫిట్‌మెంట్ కల్పించిన ఘతన సిఎం చంద్రబాబుకే దక్కుతుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి పేర్కొన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా టిఎన్‌టియుసి అధ్వర్యంలో నగరంలోని లెనిన్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కార్మికులందరూ ఒకే తాటిపై నడిచి ఐక్యంగా ఉంటేనే కార్మిక సమస్యలు పరిష్కారమవుతాయని, కార్మికుల పేరుచెప్పి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న వివిధ రాజకీయ పార్టీల కార్మిక సంఘాలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. మేడే కు ముందు ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు చేసిన ఉద్యమాలు స్ఫూర్తిదాయకమన్నారు. ఎంపి కేశినేని నాని మాట్లాడుతూ కార్మిక పోరాటాలకు కేంద్ర బిందువైన విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ కార్మిక సంస్థ టిఎన్‌టియుసి బలోపేతానికి నేతలందరూ కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే బొండ ఉమమహేశ్వరరావు మాట్లాడుతూ కార్మికుల శ్రమ శక్తి నుంచి పుట్టుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కటేనని, నాటి దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు దగ్గర నుంచి నేటి చంద్రబాబు వరకూ కార్మిక ప్రయోజన పథకాలెన్నో ప్రవేశపెట్టి అమలుచేస్తున్న విషయం గుర్తించాలన్నారు. పశ్చిమ టిడిపి ఇన్‌చార్జ్ కె నాగుల్ మీరా మాట్లాడుతూ ఎర్ర జెండా పార్టీలపై విసిగి వేసారిన కార్మికలోకం టిఎన్‌టియుసిలో చేరేందుకు ఇష్టం చూపుతున్నారని తెలిపారు. బందర్ ఎంపి కొనకొళ్ల నారాయణ, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, కార్పొరేటర్లు నెలిబండ్ల బాలస్వామి, పిన్నంరాజు త్రిమూర్తిరాజు, టిఎన్‌టియుసి నగర నాయకులు గొట్టుముక్కల రఘురామరాజు, పట్ట్భారామ్, కొట్టేటి హనుమంతరావు పాల్గొన్నారు.

ఆనందం, ఆరోగ్యాన్ని పంచేదే హ్యాపీ సండే
విజయవాడ (కార్పొరేషన్), మే 1: నగర ప్రజలకు ఆనందంతోపాటు ఆరోగ్యాన్ని పంచేందుకే హ్యాపీ సండే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని విఎంసి కమిషనర్ వీరపాండియన్ పాల్గొన్నారు. విఎంసి, డీప్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో తొలిసారిగా నగరంలోని ఐజిఎం స్టేడియం వద్ద బందర్ రోడ్డు పై నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ వీరపాండియన్ మాట్లాడుతూ ప్రతి నెల మొదటి ఆదివారం రోజున హ్యాపీ సండే కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించేందుకు ఏర్పాటు చేశామన్నారు. ఒక్క బందర్‌రోడ్డులోనే కాక నియోజకవర్గంలోని బిఆర్‌టిఎస్ రోడ్డు, పశ్చిమంలో కెటి రోడ్డు, తూర్పులో గురునానక్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో కూడా ఈకార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఆధునిక యాత్రిక జీవనంలో నగర ప్రజలు తమ కష్ట, నష్టాలను మరిచిపోయి ఉల్లాసంగాను, ఉత్సాహంగాను పాల్గొని కొద్దిపాటి ఉపశమనంతోపాటు ఆనందాన్ని కలిగించేందుకే ఈ హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మారుతున్న కాలానుగుణంగా అంతరిస్తున్న సాంప్రదాయక ఆటలు, పద్ధతులు, విలువలను నేటి తరం వారికి అందుబాటులో ఉంచేందుకు సరికొత్తగా రూపొందించిన ఈకార్యక్రమం దోహదపడుతుందన్నారు. రాబోయే రోజుల్లో మరింత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ విన్నూత్న తరహాలో నిర్వహిస్తున్న ఈకార్యక్రమానికి నగర పోలీస్ శాఖ పూర్తిగా సహకరించడమే కాకుండా తమ కుటుంబాల వారు కూడా భాగస్వాములైయ్యే విధంగా చర్యలు తీసుకొంటామన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో స్కేటింగ్, సైకిలింగ్, మినీ సైకిలింగ్, మోనో సైకిలింగ్ ఆట, పాటలు, హోలహుప్స్, వాకింగ్ స్టిక్స్, జగ్లింగ్, ఫైర్ గేమ్స్, తదితర క్రీడా కార్యక్రమాలను వీక్షకులను ఆహ్లాదపర్చాయి.

ఆలయాలు, ప్రార్థన మందిరాల కూల్చివేత
పాతబస్తీ, మే 1: అర్ధరాత్రివేళ పలు ఆలయాలను, ప్రార్ధనా మందిరాలను విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు పోలీసుల సాయంతో కూల్చివేయడం విద్యాధరపురం, భవానీపురం ప్రాంతాల్లో కలకలం సృష్టించింది. రోడ్లకు అడ్డంగా వున్నాయన్న నెపంతో శనివారం రాత్రి 12 గంటల నుంచి ఆదివారం తెల్లవారుఝామున 3 గంటల మయం మధ్యలో వీటిని కూల్చివేసిన అధికారులు కొన్నిచోట్ల అడ్డువచ్చిన ఆలయాలు, ప్రార్ధనా మందిరాల నిర్వాహకులను అరెస్టు చేశారు. భవానీపవురం, విద్యాధరపురంలోని కొన్ని రోడ్లలో ఆయా రోడ్లకు ఒక పక్కగా దేవాలయాలు, ముస్లింల జెండాచెట్టు, చర్చి కం స్కూల్ వున్నాయి. ఇవి ఆయా రోడ్ల విస్తరణకు అడ్డుగా వున్నాయని తలచిన విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు వాటిని కూల్చివేయడమే మార్గంగా తలచారు. వీటిలో కొన్నింటికి నోటీసులు ఇచ్చారు. మరికొన్నింటిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారు. కబేళా రోడ్డులో వున్న శ్రీ గంగానమ్మ దేవస్థానంను అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా శనివారం రాత్రి 2.30 గంటల సమయంలో కూల్చివేసారు. ఆలయం లోపల శ్రీ గంగానమ్మ విగ్రహం, విలువైన వస్తు సామాగ్రి వున్నాయని, తమకు కొంత సమయం ఇస్తే వాటిని భద్రపర్చుతామని వసంత చెప్పినా అధికారులు విన్పించుకోకుండా ఆలయ భవనాన్ని నేలమట్టం చేశారు. దీంతో ఆలయం లోపలి శ్రీ గంగానమ్మ విగ్రహం, ఇతర విగ్రహాలు, సామాగ్రి నేలమట్టమయ్యాయి. ఈ సంఘటన తెలిసిన వెంటనే స్థానిక సోషల్ వర్కర్ డి.రాము తదితరులు అక్కడకు చేరుకుని అధికారుల చర్యలను నిరసించారు. కాగా సితార సెంటర్ బైపాస్‌రోడ్డు వద్ద వున్న శ్రీ నాగేంద్రస్వామివారి దేవస్థానాన్ని కూడా అధికారులు నేలమట్టం గావించారు.
తీవ్ర ఉద్రిక్తత
బైపాస్ రోడ్డులో ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్డు వద్ద వున్న ముస్లింల పవిత్ర జెండా చెట్టును, ఆ పక్కనే వున్న శ్రీరామాలయంను విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు కొలగొట్టే సమయంలో ఆ ప్రాం