ఆంధ్రప్రదేశ్‌

టిడిపి జిల్లా అధ్యక్షులు వీరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 18: తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల పేర్లను ఎట్టకేలకు పార్టీ అధిష్ఠానం ఆదివారం ప్రకటించింది. మహానాడు ముగిసే నాటికే పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తయినప్పటికీ జిల్లా అధ్యక్షుల పేర్లు ప్రకటించడంలో జాప్యంపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి చోటుచేసుకుంది. జిల్లా అధ్యక్షుల పదవులకు పోటీ ఉందని పేర్కొంటూ అన్ని జిల్లాల అధ్యక్షుల పేర్లు ప్రకటించడాన్ని నిలిపివేయడం తెలిసిందే. దీని ప్రభావం రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికపై కూడా పడుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్న నేపథ్యంలో జిల్లా అధ్యక్షుల జాబితాను విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా గౌతు శిరీష, ప్రధాన కార్యదర్శిగా సాదు చిన కృష్ణంనాయుడు, విజయనగరం జిల్లా అధ్యక్షునిగా మహంతి చిన్నంనాయుడు, ప్రధాన కార్యదర్శిగా ఐవిపి రాజు, విశాఖ అర్బన్‌కు వాసుపల్లి గణేష్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా చోడే వెంకట పట్ట్భారామ్, విశాఖ రూరల్‌కు పంచకర్ల రమేష్‌బాబు, ప్రధాన కార్యదర్శిగా బుద్ధ నాగ జగదీష్, తూర్పు గోదావరి జిల్లాకు నామన రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా పిల్లి సత్యనారాయణ మూర్తి, పశ్చిమ గోదావరి జిల్లాకు తోట సీతారామలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా వుప్పల జగదీష్ బాబు నియమితులయ్యారు. కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షునిగా బచ్చుల అర్జునుడు, ప్రధాన కార్యదర్శిగా కోట వీరబాబు, గుంటూరుకు జివిఎస్ ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా హాజీ షేక్ లాల్‌వజీర్, ప్రకాశం జిల్లాకు దామచర్ల జనార్ధన్, ప్రధాన కార్యదర్శిగా కొమ్మూరి రవిచంద్ర శేఖర్‌బాబు, నెల్లూరు జిల్లాకు బీద రవిచంద్ర, ప్రధాన కార్యదర్శిగా చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, చిత్తూరు జిల్లాకు పులపర్తి వెంకట మణిప్రసాద్ (నాని), ప్రధాన కార్యదర్శిగా జి నరసింహ యాదవ్, కడప జిల్లాకు రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బాలిశెట్టి హరిప్రసాద్, కర్నూల్ జిల్లాకు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా నాగేశ్వరరావు యాదవ్, అనంతపురం జిల్లాకు బికె పార్థసారథి, ప్రధాన కార్యదర్శిగా గోనుగుంట్ల సూర్యనారాయణ నియమితులయ్యారని పార్టీ కేంద్ర కార్యక్రమాల కన్వీనర్ వివివి చౌదరి ప్రకటించారు.