ఆంధ్రప్రదేశ్‌

టిడిపిపై ఇక ప్రత్యక్షపోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మే 2: తెలుగుదేశం పార్టీ తీరుపై ఇక ప్రత్యక్ష పోరాటానికి రాయలసీమ బిజెపి నేతలు సిద్ధపడుతున్నారు. సీమలో విలయతాండవం చేస్తున్న కరవును రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, తాగునీరు, పశువులకు దాణా కరవై కబేళాలకు తరలిస్తున్నా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదంటూ ఆందోళనకు బిజెపి నేతలు వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కడప నగరంలో ఆదివారం రాత్రి సీమ జిల్లాలకు చెందిన బిజెపి నేతలు జరిపిన రహస్య సమావేశంలో ఆ మేరకు నిర్ణయించినట్టు సమాచారం. రాష్టవ్రిభజన అనంతరం నూతన రాజధాని నిర్మాణానికి, పెండింగ్‌ప్రాజెక్టులకు, అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమానికి కేంద్రం వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నా ఆ నిధుల గురించి చెప్పకుండా, కేంద్రంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని బిజెపి నేతలు సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సీమలో విస్తృతంగా పర్యటించి జిల్లాల వారీగా ఆందోళన చేపట్టేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్‌చార్జి కపిలేశ్వరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రవీందర్‌రాజు, సురేష్‌రెడ్డి, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, పార్థసారధి, జాతీయ కార్యవర్గసభ్యులు శాంతారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనాధరెడ్డి, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు వి శశిభూషణ్‌రెడ్డి, రాయలసీమకు చెందిన ఇతర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ మేరకు సీమ నేతలకు బిజెపి హైకమాండ్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టుతెలుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో రాజంపేట బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూసిన కేంద్రమాజీ మంత్రి డి పురంధ్రీశ్వరి, ఒకప్పుడు జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా పనిచేసి ప్రస్తుతం బిజెపిలో సీనియర్ నేతగా కొనసాగుతున్న కన్నా లక్ష్మీనారాయణ, తదితరులను ముందుంచి టిడిపి ప్రభుత్వంపై నిరసన ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం జరగదని, అభివృద్ధి నిమిత్తం వేల కోట్లరూపాయలు మంజూరు చేస్తున్నామని పార్లమెంటులో ప్రకటించడంతో టిడిపి నేతలు బిజెపిపై విరుచుకుపడుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు ప్రారంభించారు. దీంతో బిజెపి హైకమాండ్ కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి ఉద్యమాలకు సిద్ధం కావాలని రాష్ట్రంలోని బిజెపి నేతలను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీమ జిల్లాలకు చెందిన బిజెపి నేతలంతా ఏకమై జిల్లాల వారీగా కరవు, తాగునీటి సమస్య, పంటల నష్టాలు, పశువులకు దాణా, నీటి కొరత, ప్రాజెక్టుల నిర్మాణాల్లో జాప్యం, తదితర సమస్యలపై ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు.