ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీ ఉద్యోగులకు 60ఏళ్ల రిటైర్మెంట్ వెంటనే ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 18: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఏపిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగ, కార్మికులకు కూడా 60 ఏళ్లు రిటైర్మెంట్ అమలుపర్చేలా బోర్డులో నిర్ణయం చేసి గాని, లేదంటే పెండింగ్ బోర్డు అప్రూవల్ గాని నిర్ణయం చేసి వెంటనే అమలు జరిగేలా చూడాలని ఏపిఎస్‌ఆర్‌టిసి ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవి రావు, ప్రధాన కార్యదర్శి కె.పద్మాకర్, అదనపు కార్యదర్శి పి.దామోదరరావు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్లకు పెంపుదల విషయంలో గతంలో ఇయు చేసిన విజ్ఞప్తి మేరకు విల్లింగ్ పద్ధతి తీసుకుని కావాలనుకున్న వారికి 60 ఏళ్లకు పొడిగించి వద్దనుకునేవారికి మాత్రం 58 ఏళ్లకే రిటైర్మెంట్‌ను అన్ని బెనిఫిట్స్ వర్తింపచేయాలన్నారు. ఈ విషయమై సంస్థ ఎండి మాలకొండయ్యను కలసి విజ్ఞప్తి చేసామని ఇయు నాయకులు తెలిపారు. సిసిఎస్ నుండి ఆర్టీసీ యాజమాన్యం వాడుకున్న రూ.110 కోట్లను వెంటనే చెల్లించాలన్నారు. పిల్లల పెళ్లిళ్ల కోసం, చదువుల కోసం రుణ దరఖాస్తులు పెట్టుకున్నవారు, రెండు నెలలుగా రుణాలు రాక, పిల్లలు ఉన్నత చదువులు చదువుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉద్యోగుల నుండి వాడుకున్న డబ్బులను వెంటనే ఇవ్వాలని లేదంటే ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతేకాకుండా 2017 జూలై నుండి కొత్త డిఎ ప్రకటించాల్సిన సమయం వస్తున్నప్పటికీ 2016 జూలై, 2017 జనవరిలకు ప్రకటించిన డిఎకు సంబంధించి 10 నెలల అరియర్స్ ఇంకా పెండింగ్ ఉన్నందున వాటి అరియర్స్‌ను వెంటనే చెల్లించాలని చేసిన తమ విజ్ఞప్తిపై డిఎ అరియర్స్‌ను చెల్లించేందుకు మాలకొండయ్య సానుకూలంగా స్పందించారని వారు వివరించారు.

మద్యం వ్యాపారంలో అవినీతి, అక్రమాలు అరికట్టండి!
విజయవాడ బ్యూరో: రాష్ట్రంలోని మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి సాగిస్తున్న అవినీతి, అక్రమాలను అరికట్టాలని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ప్రధానంగా ఎంఆర్‌పికి మించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు, మరికొన్నిచోట్ల పగలూ రాత్రి మద్యం వ్యాపారం సాగిస్తున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ గ్లాసులు, నీళ్ల ప్యాకెట్లు విక్రయించడమే కాకుండా వాటిపై కూడా అధిక ధర వసూలు చేస్తున్నారన్నారు. కాకినాడ దుమ్ములపేటలో ఒక మద్యం దుకాణం కింద 20 బెల్టుషాపులున్న పరిస్థితిపై గత ఐదు మాసాలుగా స్థానిక అధికారుల నుంచి ఎక్సైజ్ మంత్రి వరకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నానని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుత ఎక్సైజ్ కమిషనర్ చేపట్టిన చర్యల వల్ల మద్యం సిండికేట్ల నుంచి అధికారులు లంచాలు తీసుకోటం తగ్గినప్పటికీ అధిక ధరలు అదుపు కావటం లేదని లేఖలో వీర్రాజు వివరించారు.