ఆంధ్రప్రదేశ్‌

ముగిసిన జాతీయస్థాయి విలువిద్య పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 18: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఒఎన్‌జిసి బేస్ కాంప్లెక్సు ప్రాంగణంలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి విలువిద్య పోటీలు ఆదివారంతో ముగిశాయి. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 126వ జయంతోత్సవాలను పురస్కరించుకుని ఏకలవ్య గిరిజన విలువిద్య పోటీల పేరుతో ఈ పోటీలను ఒఎన్‌జిసి ఎస్సీ, ఎస్టీ ఎంప్లారుూస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీల్లో ఉత్తరప్రదేశ్, పశ్చిమబంగ, ఆంధ్రప్రదేశ్, అసోం, జార్ఖండ్, ఒడిస్సా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి సుమారు 200 మంది గిరిజన క్రీడాకారులు హాజరయ్యారు. పోటీలు రెండు విభాగాల్లో జరిగాయి. 50 ప్లస్ 30 మీటర్ల మెన్ సీనియర్ విభాగంలో గోర హో (జార్ఖండ్), అరుణ్ బొరొ (అసోం), రామ్‌కిమ్ సిహెచ్ హబ్రమ్ (జార్ఖాండ్), ఉత్తమ్ స్వర్గయరీ (అసోం) విజేతలుగా నిలిచారు. మహిళల విభాగంలో పల్లబి బొరో (అసోం), తుతూమొని బొరొ (అసోం), కామిని బొరొ (అసోం), పౌవ్‌మెయిరూ గోల్మె (మణిపూర్) విజయం సాధించారు. 70 ప్లస్ 70 సీనియర్ మెన్స్ విభాగంలో సంజయ్ బొరో (అసోం), రంజిత్ నాయక్ (ఒడిస్సా), సబిత్ ఖాఖలరీ (అసోం), కరన్ హంధా (జార్ఖండ్) విజయం సాధించారు. 70 ప్లస్ 70 ఉమెన్స్ విభాగంలో దిపాలీ బొరొ(అసోం), సీతారాణి తుడు (జార్ఖండ్), ప్రతివా బొరొ(అసోం), అఖ్ఫర్ బస్మతరి (అసోం) విజయం సాధించారు.