ఆంధ్రప్రదేశ్‌

పిఆర్‌సి బకాయిలపై త్వరలో నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 18: ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్‌సి వేతన బకాయిలపై కమిటీని నియమించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఏపి ఎన్జీవో జెఎసి అధ్యక్షుడు పి అశోక్‌బాబు తెలిపారు. ఆదివారం గుంటూరు జిల్లా ఎన్జీవో అసోసియేషన్ హాలులో జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. అనంతరం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ పిఆర్‌సి బకాయిలు చెల్లించాలని ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించామని, బకాయి వేతనాలు ఎలా చెల్లించాలనే అంశంపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఓ కమిటీని నియమించి నివేదిక ప్రకారం చెల్లింపులు జరుపుతామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయమై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 50 శాతం వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. సిసలైన జెఎసి తమదేనని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారి మాటలు విశ్వసించవద్దని కోరారు. జిల్లాలోని 20 యూనిట్లలో సభ్యుల సంఖ్య పెంచాలని సూచించారు. గత పాలకవర్గం అవకతవకలకు పాల్పడి 30 లక్షల రూపాయలకు లెక్కలు తేల్చలేదని, అందువల్ల ఆ కమిటీని రద్దు చేసినట్లు చెప్పారు. పారదర్శకంగా వ్యవహరించకుంటే ఎవరినీ ఉపేక్షించేదిలేదని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలో 20 హెచ్‌వోడిలు ఉన్నందున ఇకపై వారంలో ఒకసారి వచ్చి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా కార్యాచరణ రూపొందించామని అశోక్‌బాబు వివరించారు.