ఆంధ్రప్రదేశ్‌

తిరుమలలో తరగని రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 18: వేసవి సెలవులు ముగుస్తున్నప్పటికీ శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తరగడం లేదు. ఆదివారం సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడక భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. ఆదివారం తెల్లవారుజాము 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 68,912 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మరో 30 వేల మంది స్వామివారి దర్శనంకోసం వేచి ఉన్నారు. భక్తులు హుండీ ద్వారా సమర్పించిన కానుకల ద్వారా రూ. 2.47 కోట్లు ఆదాయం లభించింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జెఇఓ శ్రీనివాసరాజు గత వారం రోజులుగా వైకుంఠం కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, పిఏసిలలో నిరంతరం పర్యటిస్తూ అధికారులకు తగు సూచనలు ఇస్తున్నారు.
ప్రధానంగా భక్తులలో పిల్లలకు పాలు, పెద్దలకు అల్పాహారం, కాఫీ, టీ, అన్నప్రసాదాల కొరత రాకుండా క్యాంటీన్ అధికారి శాస్ర్తీకి పలు సూచనలు చేశారు. ఈనేపథ్యంలో ఆదివారం ఆలయం ముందు జెఇఓ శ్రీనివాసరాజు మాట్లాడుతూ సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా స్వామివారి దర్శన సమయం ఎక్కువ కాకుండా వేసవిలో అనేక చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా గత 25 రోజులుగా విఐపి దర్శనాలను రద్దుచేసి ప్రొటోకాల్‌కు మాత్రమే పరిమితం చేశామన్నారు. రూ. 300 దివ్యదర్శనం టికెట్లను సైతం అపరిమితంగా ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. అనేక పరీక్షల ఫలితాలు రావడం, పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల కోసం మొక్కులు తీర్చుకోవడానికి కాలినడకన వస్తున్న వారి సంఖ్య కూడా పెరిగిందని చెప్పారు. కాలినడకన వస్తే త్వరితగతిన దర్శనం అవుతుందని భావించక్కర్లేదన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగినప్పుడు కాలినడకన వచ్చే భక్తులకు కూడా దర్శన సమయం ఎక్కువగా ఉంటుందని, ఇందుకు భక్తులు కూడా సహకరించాలని కోరారు.
శనివారం 44 వేల మంది భక్తులు కాలినడకన తిరుమలకు చేరుకున్నారన్నారు. అందరికీ స్వామివారి దర్శనం బాగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భక్తుల సంఖ్య పెరగడంతో దర్శనానికి కొంత ఎక్కువ సమయం పడుతోందని ఆయన వివరించారు. భక్తులు సంయమనంతో టిటిడికి సహకరించాలని ఆయన కోరారు.