ఆంధ్రప్రదేశ్‌

‘పాలారు’పై చెక్‌డ్యాంలు ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం, జూన్ 18: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రవహిస్తున్న పాలారు నదిపై ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న చెక్‌డ్యాంలను వెంటనే నిలిపివేయాలని తమిళనాడు రాష్ట్ర డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. ఆదివారం 30 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు కుప్పం మండల పరిధిలోని కంగుంది పంచాయతీకి చెందిన పెద్దవంక వద్ద పాలారు నదిపై నిర్మించిన చెక్‌డ్యాంను, ప్రస్తుతం కుప్పం నుంచి కంగుంది వెళ్లే రహదారిలోని పాలారు వద్ద ఆర్ అండ్ బి అధికారులు నిర్మిస్తున్న వంతెనను పరిశీలించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి ఆంధ్ర మీదుగా తమిళనాడు వరకు ప్రవహిస్తున్న పాలారు నదిపై ఆంధ్ర ప్రభుత్వం ఇప్పటికే అక్రమంగా పలు చెక్‌డ్యాంలను నిర్మించిందన్నారు. వీటికితోడు ఈ మధ్యకాలంలో వాటి ఎత్తును కూడా పెంచారన్నారు. తమిళనాడులో వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలు, రైతులను ఆదుకునేందుకు తమిళనాడు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు కమిటీలను వేసుకుని పాలారు నదిపై నిర్మిస్తున్న చెక్‌డ్యాంల గురించి చర్చించి ఆపై చెక్‌డ్యాంలను నిర్మించాలన్నారు. తమిళనాడుకు నీరు రాకుండా అక్రమంగా చెక్‌డ్యాంలు నిర్మించడం ఏమాత్రం సబబు కాదని అన్నారు. ఈ సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కుప్పం సిఐ రాజశేఖర్‌తో పాటు కుప్పం ఎస్సై రామస్వామి, తమిళనాడు పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. అనంతరం పాలారు నుంచి కుప్పం పట్టణం మీదుగా మల్లానూరు, పెద్దవంక మీదుగా తమిళనాడు రాష్ట్రానికి వెళ్లారు.

చిత్రం.. కుప్పం మండలం పాలారు వద్ద నిర్మిస్తున్న వంతెనను పరిశీలిస్తున్న
డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తదితరులు