ఆంధ్రప్రదేశ్‌

త్వరలో వైద్య పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, జూన్ 18 : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య తెలిపారు. ఆమె ఆదివారం అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అలాగే సత్యసాయి జనరల్ ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను సందర్శించి అక్కడ రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి తెలుసుకుని అభినందించారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ గుంటూరులో మహాప్రస్థానం పేరుతో కొత్త వైద్యసేవలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో మృతిచెందిన వారి మృతదేహాలను ఉచితంగా ఆధునిక సౌకర్యం గల వాహనాలతో వారి వారి ఇళ్లకు చేరుస్తారన్నారు. త్వరలో అన్ని జిల్లాల్లో, ప్రాంతీయ వైద్యశాలల్లో ఈ సదుపాయం కల్పిస్తామన్నారు. ఒప్పంద వైద్యులను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 84 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మిస్తున్నామని, వాటిని త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఆమెతో పాటు జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, సత్యసాయి ట్రస్టు సభ్యులు ఆర్‌జె.రత్నాకర్, ప్రసాదరావు, సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి డైరెక్టర్ గురుమూర్తి ఉన్నారు.

చిత్రం.. సత్యసాయి వైద్యశాలను సందర్శిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య