ఆంధ్రప్రదేశ్‌

విశాఖ వేదికగా పోటీ రాజకీయాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 18: ప్రశాంత విశాఖ నగరంలో ఉద్రిక్తతతలకు తెరతీసే కార్యక్రమాలకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. విశాఖ భూ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు జరపాలన్న ప్రధాన డిమాండ్‌తో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 22న విశాఖ కలెక్టర్ కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. రెండు రోజుల కిందటే ఆ పార్టీ ప్రతినిధులు ఈ విషయాన్ని ప్రకటించారు. విశాఖ భూముల కుంభకోణంలో పూర్తిగా ఇరుక్కుపోయిన అధికార టిడిపి, ఆత్మరక్షణలో పడిపోయింది. జగన్ సభను ఢీకొనే విధంగా విశాఖ నగర టిడిపి ఆధ్వర్యంలో మహా సంకల్ప సభ సరిగ్గా అదే రోజున స్థానిక జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద జరగబోతోంది. సుమారు ఐదు వేల మందితో ఈ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సభకు పార్టీలోని ముఖ్య నాయకులు కూడా హాజరు కానున్నారని పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ తెలిపారు. ఈ రెండు పార్టీలు పోటా పోటీ సభలు నిర్వహించడం వలన నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా ఈ ఏడాది జనవరి 26న విశాఖ బీచ్ రోడ్డులో జల్లికట్టు తరహా ఉద్యమాన్ని నిర్వహించాలని జగన్ సంకల్పించారు. అయితే, ఆరోజు బీచ్ రోడ్డుపై రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఆరోజు సాయంత్రం విమానంలో విశాఖకు చేరుకున్న జగన్‌ను విమానశ్రయం నుంచి బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ఈ పోటా పోటీ జగన్ సభకు పోలీసులు అనుమతిస్తారా లేదా? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. జగన్ సభకు అనుమతి ఇవ్వకపోతే, ప్రతిపక్షంతో సహా విపక్షాలన్నీ ఏకమై రోడ్డెక్కే అవకాశం లేకపోలేదు. ఒకవేళ జగన్ సభకు అనుమతి లభించినా, ఏక కాలంలో రెండు సభలు జరగడం వలన కూడా ఉద్రిక్తతతలు చోటు చేసుకుంటాయని భావిస్తున్నారు.