ఆంధ్రప్రదేశ్‌

విశాఖ భూకుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 18: విశాఖ భూకుంభకోణంలో అన్ని పార్టీల నాయకులకు వాటా ఉందని, దీనిపై సిబిఐతో విచారణ జరిపించాలని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే అఖిలపక్షంతో బహిరంగ చర్చ జరపాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి, మద్యం, భూ కుంభకోణాల ద్వారా దోచుకున్న సొమ్మును ఖజానాకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది నాయకులు అన్ని ప్రభుత్వాల్లో దోపిడీకి పాల్పడుతున్నారని విశాఖపట్నం భూ కుంభకోణాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన టోల్‌ఫ్రీ నెంబర్ ద్వారా కిందిస్థాయి ఉద్యోగులు రూ.500 అవినీతికి పాల్పడితే ఆ సొమ్మును స్వాధీనం చేసుకుని బాధితులకు ఇప్పిస్తున్నారని, అయితే రాజకీయ నేతల దోపిడీ సొమ్ము వెనక్కిరాదా అని నిలదీశారు. కుంభకోణాల సొమ్మును కూడా ఖజానాకు చేర్చాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రులుగా పనిచేసిన వారే ఈప్రభుత్వంలోనూ పనిచేస్తున్నారని, వారే విశాఖ భూ కుంభకోణంలో ప్రధాన సూత్రధారులుగా ఉన్నారన్నారు. ఇలాంటి నాయకుల వల్ల రాజకీయ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందన్నారు. రాజకీయ పార్టీలు కూడా అలాంటి వారిని చేర్చుకునే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో మద్యం సిండికేట్ నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు సాగించి రోజుకు రూ. 12కోట్ల దోపిడీ చేస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు. రాష్ట్రంలో ఐదుకోట్ల మంది జనాభా ఉంటే వారిలో కోటి మంది మద్యం సేవిస్తున్నారని, మద్యం సీసాకు సగటున రూ.12 అదనంగా వసూలు చేస్తున్నారని సోము తెలిపారు. ఈలెక్కన రోజుకు 12కోట్ల చొప్పున నెలకు 360కోట్లు మద్యం సిండికేట్ దోపిడీ చేస్తోందన్నారు. ఈదోపిడీకి అడ్డుకట్ట వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బహిరంగ లేఖ రాసినట్టు తెలిపారు. కాపులను బిసిల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న పాదయాత్రపై ప్రభుత్వం అతిగా స్పందిస్తున్నట్లు కనిపిస్తోందని, తద్వారా ముద్రగడ ఉచ్చులో పడుతోందని సోము అభిప్రాయపడ్డారు. టిడిపితో పొత్తు కొనసాగించే అంశాన్ని పార్టీ అధినేత అమిత్‌షా నిర్ణయిస్తారని సోము తెలిపారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడ్ని ఎన్నుకోలేకపోతోందన్న అంశంపై ప్రశ్నించగా ప్రస్తుతం పార్టీకి అధ్యక్షుడు ఉన్నారని, ఆయన ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా అని బదులిచ్చారు.