ఆంధ్రప్రదేశ్‌

తొలగించిన విద్యుత్ ఉద్యోగులను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 18: తెలంగాణ ప్రభుత్వం తొలగించిన 1250 మంది విద్యుత్ ఉద్యోగులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, ఏపి సర్కార్ తక్షణమే వారి సమస్యను పరిష్కరించాలని ఏపి జెఎసి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం ఏపి జెఎసి అమరావతి పేరిట జిల్లా శాఖను ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్ర మనోవేదనతో ఉన్న తొలగించిన విద్యుత్ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రెండు విడతల పిఆర్‌సి, డిఎ బకాయిలను ఒకేసారి చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులకు 50 శాతం వేతనాల పెంపు తమ కృషి ఫలితంగానే జరిగిందన్నారు. దివ్యాంగ ఉద్యోగుల పదోన్నతిలో మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు రెండు నెలల సమ్మె కాలానికి రావాల్సిన జీతం బకాయిలు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేలా, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుపరిచేలా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని బొప్పరాజు వివరించారు.