రాష్ట్రీయం

విజయవాడలో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 18: నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తీవ్ర మనస్తాపంతో ఓ కుటుంబం బలిదానానికి ఒడిగట్టింది. కృష్ణలంకలో నివాసముంటున్న బొత్స సురేష్ దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిపి విషం తాగారు. వీరిలో ముగ్గురు చనిపోగా, ఇద్దరు ఆడపిల్లలు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కుటుంబపరమైన ఆర్థిక ఇబ్బందులే ఈ స్థితికి దారితీశాయని పోలీసులు అంటున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణలంక రణదివె నగర్‌లో నివాసముంటున్న బొత్స సురేష్(35) ఆటో నడుపుతుంటాడు. ఈయన కుటుంబంలో భార్య ఏసమ్మ(29), కుమారుడు హరిచరణ్(10), కుమార్తెలు జాను(9), లిఖిత(7) ఉన్నారు. సురేష్ అత్త పెంటమ్మ నగరపాలక సంస్థలో శానిటేషన్ వర్కర్‌గా పనిచేస్తోంది. ఇల్లరికం అల్లుడైన సురేష్ అప్పుడప్పుడూ ఆటో నడిపినా ముఖ్యంగా అత్తకు బదులు ఇతనే పనికి వెళ్తుంటాడు. పని ఇతను చేసినా జీతం మాత్రం అత్త పెంటమ్మ తీసుకుంటుంది. దీంతో ఇంటి నిర్వహణ ఆర్థికపరంగా ఆమె చూస్తుంటుంది. ఈనేపథ్యంలో వారి మధ్య ఆర్థికపరమైన కుటుంబ విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో మనస్థాపానికి గురైన సురేష్ ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. ఈ క్రమంలో ముందుగా ప్రణాళిక వేసుకున్నాడు. శనివారం కుమార్తె జాను పుట్టిరోజు కూడా కలిసి వచ్చింది. కుటుంబ సభ్యులంతా వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తర్వాత రాత్రి ఇంట్లో భార్య దోసెలు వేయగా వాటిలో ముందుగా తెచ్చుకున్న విషం పౌడర్‌ను కలిపిన సురేష్ తన భార్య, పిల్లలతో తినిపించి తానూ తిన్నాడు. దీంతో వీరికి వాంతులు కావడంతో స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించేలోగా సురేష్, ఏసమ్మ, హరిచరణ్ మృతి చెందారు.
కుమార్తెలు జాను, లిఖిత మాత్రం విషమ పరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న డిసిపి పాలరాజు, ఏసిపి కె శ్రీనివాసరావు, ఇతర అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించగా స్వగ్రామం ఉయ్యూరు తరలించారు. కాగా తల్లిదండ్రులు, సోదరుడిని కోల్పోయిన ఆడపిల్లలు ఇద్దరూ అనాథలై ఆస్పత్రిలో ఉన్నారు. వీరి పరిస్థితి చూసి చుట్టుపక్కల నివాశితులు కంటతడి పెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కృష్ణలంక సిఐ దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం.. సురేష్ కుటుంబం (ఫైల్ ఫొటో)