హైదరాబాద్

పిల్లల విద్యాభివృద్ధికి నాలెడ్జ్ ఇన్‌పుట్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 18: ఇండో-పాక్ సరిహద్దులో భద్రతా చర్యలు, ఇతర విషయాలను స్వయంగా చూసి వచ్చిన మాస్టర్ రవికర్ తన తల్లిదండ్రులు నరసింహారెడ్డి, ఇందిరతోసహా ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆదివారం కలిశాడు. ఈ సందర్భంగా రవికర్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. రవికర్ చిన్నవాడైనప్పటికీ పెద్ద ఆలోచనలు కలిగి ఉన్నాడని కొనియాడారు. రాష్ట్రంలో పిల్లల విద్యాభివృద్ధికి నాలెడ్జ్ ఇన్‌పుట్స్ పెంచడానికి కృషి చేస్తున్నామన్నారు. పిల్లలకు తల్లిదండ్రుల ప్రోత్సాహం బాగా ఉన్నప్పుడే వారేదైనా సాధించగలుగుతారన్నారు. తండ్రి ఆఫీసు పనుల్లో నిమగ్నమై ఉంటారని, తల్లి ప్రోత్సహం, ఆలనాపాలనా వల్ల పిల్లలు బాగా ఎదగగలుగుతారన్నారు. పిల్లలను టివి, సినిమాలకు దూరంగా ఉంచాలని సిఎం సూచించారు. పాఠ్యాంశాలకు అదనంగా దేశ ప్రముఖులు, ప్రముఖ సంఘటనలు, దేశభక్తి అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించాలని, తద్వారా వారు ప్రయోజకులవుతారని అన్నారు. రాష్ట్రంలో నూతనంగా చేపట్టిన ప్రాజెక్టుల గురించి రవికర్ ప్రస్తావించగా పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని చెప్పి వెనువెంటనే ప్రయాణ ఏర్పాట్లు చేయటంతో ప్రాజెక్టు పనుల సందర్శనకు వెళ్లాడు. తనకు మహానాడులో పాల్గొనే అవకాశం కల్పించాలని రవికర్ కోరగా పాల్గొనాలని ఎందుకనుకుంటున్నావని సిఎం ప్రశ్నించారు. ‘పెద్దవారు మాట్లాడినవి పెద్దవారికి అర్థమవుతాయ్. నా వయస్సు చిన్నవాళ్లకి నేను మాట్లాడేవి అర్థమవుతాయ్’ అని రవికర్ సమాధానమిచ్చాడు. దీంతో తదుపరి మహానాడులో పాల్గొనేందుకు నీకు అవకాశమిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. మాస్టర్ రవికర్ స్వగ్రామం చిత్తూరు జిల్లా మదనపల్లె. సరిహద్దు భద్రతా దళాలు దేశాన్ని కాపాడటానికి ఎలాంటి విధులు, బాధ్యతలు చేపడుతున్నాయి? సరిహద్దుల్లో నెలకొన్న క్లిష్ట పరిస్థితులు, తదితర అంశాలను దినపత్రికల ద్వారా తెలుసుకున్నాడు. సరిహద్దు భద్రతా దళాల సేవలను ప్రత్యక్షంగా చూడాలని వుందని బిఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాశాడు. ఐదో తరగతి చదువుతున్న రవికర్‌కి సరిహద్దు దళాలపై ఆసక్తి, దేశభక్తిని గుర్తించిన బిఎస్‌ఎఫ్ డిజి కెకె శర్మ స్పందించి సరిహద్దుల్లో మార్చి 21 నుంచి 26 వరకు పర్యటనకు అనుమతించారు. సరిహద్దు భద్రతా దళాలు నిర్వహిస్తున్న విధులు, వాతావరణ పరిస్థితులను అతనికి ప్రత్యక్షంగా చూపించారు.

చిత్రం.. రవికర్‌ను అభినందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు