ఆంధ్రప్రదేశ్‌

ఏపీపై కోర్టుకెళతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 19: తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు.. ట్రావెల్స్‌పై చట్ట వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని ప్రైవేట్ బస్సు యజమానుల సంఘం ఉపాధ్యక్షుడు సునీల్ ఆరోపించారు. తాము నిబంధనల మేరకే బస్సులు నడుపుతున్నామని, అయినా ఒక వ్యక్తి ఒత్తిడికి లొంగి తమను ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏపి ప్రభుత్వంపై త్వరలో కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో తాము చర్చలకు సిద్ధమేనన్నారు. ఆర్టీసీకి తాము పోటీకాదని తెలిపారు. తాను వైసిపి అధినేత జగన్‌కు బినామీ కాదని, అతనితో తనకెటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ రిజిస్ట్రేషన్లపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం లేకపోవటంతోనే ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని ఆయన సోమవారం మీడియాకు తెలిపారు.