ఆంధ్రప్రదేశ్‌

రూ.415 కోట్లతో ఆలయాల ముస్తాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి), మే 2: ఆగస్టులో రానున్న కృష్ణా నది పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు మొత్తం 415 కోట్ల రూపాయల ఖర్చుతో ఆలయాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్టు దేవాదాయ ధర్మాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ ఎస్‌ఎస్ సుబ్బారావు తెలిపారు. సోమవారం ఉదయం ఆయన ఇక్కడ ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. కృష్ణా నది తీరం వెంబడి వున్న దేవాలయాలతో పాటు అన్ని ఆలయాలను వైభవంగా తీర్చిదిద్దేందుకు పనులు ప్రారంభించినట్టు తెలిపారు. కృష్ణా జిల్లాకు సంబంధించి రూ. 16.09 కోట్లతో 221 పనులు చేపట్టినట్టు చెప్పారు. ఇందులో ఆలయాల మరమ్మతులు, పెయింటింగ్ వేయించటం, క్యూమార్గాలతో పాటు సామాన్య భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పనులు జూలై 15 నాటికి పూర్తయ్యేలా ఖరారైన టెండర్ల మేరకు ఇప్పటికే ప్రారంభించామని సిఇ సుబ్బారావు వివరించారు. దేవాదాయ శాఖ ఇఇ శ్రీనివాస్‌ను వెంటపెట్టుకొని జిల్లాలోని వివిధ ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం ఆయన పర్యవేక్షించారు. ఆయా పనుల వివరాలను రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి నివేదించినట్లు తెలిపారు.