ఆంధ్రప్రదేశ్‌

స్వయంకృతమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 20: బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావును ప్రభుత్వం అర్ధంతరంగా తొలగించిన వ్యవహారంలో నాయకత్వ స్వయంకృతమే ఎక్కువగా ఉందన్న అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న వారిని కాదని, అధికారులను వివిధ పదవుల్లో నియమిస్తున్న పార్టీ నాయకత్వ తొందరపాటుతనానికి, ఇప్పుడు మూల్యం చెల్లించుకోవలసి వస్తోందని, దీనిని గుణపాఠంగా తీసుకోవాలని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. నిజానికి కార్పొరేషన్ చైర్మన్‌గా పార్టీకి చెందిన సీనియర్ నేత వేమూరి ఆనందసూర్యకు తొలుతే అవకాశం ఇవ్వాల్సి ఉంది. ఆనందసూర్యకు వైస్ చైర్మన్ ఇస్తామని ప్రతిపాదించినా ఆయన దానిని తిరస్కరించారు. అప్పటినుంచీ ఇప్పటివరకూ ఆయన బాబు చుట్టూ పదవి కోసం ప్రదక్షణలు చేస్తూనే ఉన్నారు. చివరకు ఆంధ్ర మూలాలున్నప్పటికీ, ఆయన తెలంగాణ పార్టీ కార్యదర్శిగా మిగిలిపోయారు. ఇప్పుడు ఐవైఆర్ అడ్డం తిరగడంతో మళ్లీ ఆనందసూర్యను చైర్మన్‌గా నియమించాల్సి వచ్చింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం తమ నాయకత్వానికి సాధారణమయిందంటున్నారు. ఈ నిర్ణయమేదో అప్పుడే తీసుకుని ఉంటే ఇంత వివాదం వచ్చేదికాదని పార్టీ వర్గాలు విశే్లషిస్తున్నాయి. అయితే, పార్టీ నాయకత్వం చేసిన తాత్సారం వల్ల ఇప్పుడు తెలంగాణకు చెందిన ఆనందసూర్యకు ఏపిలో ఎలా చైర్మన్ ఇస్తారంటూ ఏపి బ్రాహ్మణ సంఘ వర్గాలు ప్రశ్నించే పరిస్థితికి పార్టీ నాయకత్వం కారణమయిందంటున్నారు. పదవుల నియామకాలకు సంబంధించి పార్టీలో ఏ స్థాయిలోనూ చర్చ జరగనందుకే వివాదాలు రేగుతున్నాయంటున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ డైరక్టర్లు, జిల్లా కో ఆర్డినేటర్ల నియామకాల్లో పార్టీ కార్యక్రమాల కమిటీ తీరు వల్ల ముక్కుమొహం తెలియని చాలామందికి పదవులొచ్చాయని, వైసీపీ సానుభూతి పరులకూ కో ఆర్డినేటర్ల పదవులొచ్చాయన్న విమర్శలున్నాయి. కాగా, తాజా పరిణామాల్లో ఐవైఆర్‌ను తొలగించిన తీరు మాత్రం విమర్శలకు దారి తీసింది. కార్పొరేషన్‌ను కిందిస్థాయికి తీసుకువెళ్లడంలో ఐవైఆర్ కష్టపడ్డారు. కానీ ఆయన వల్ల పార్టీకి మైలేజీ రాలేదని పార్టీకి చెందిన నేతలు చెబుతున్నారు. ఇప్పుడు ఆయనను తొలగించి, అదే సామాజికవర్గానికే చెందిన ఆనందసూర్యను నియమించినప్పటికీ, అది తెరమరుగై ఐవైఆర్‌ను తొలగించిన సానుభూతే సహజంగా తెరపైకి వస్తుందని విశే్లషిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ-ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించిన కమ్మ, కాపు నేతల క్రమశిక్షణారాహిత్యం మళ్లీ చర్చలోకి రావడం పార్టీకి ఇబ్బందికరమేనని సీనియర్లు చెబుతున్నారు. దీనివల్ల ఒక కులాన్ని బాబు ఉపేక్షిస్తున్నారని, మిగిలిన కులాల వారిపై వెంటనే చర్యలు తీసుకుంటున్నారన్న సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని విశే్లషిస్తున్నారు. ఆ మేరకు బ్రాహ్మణ సంఘ నేతలు మీడియాలో చేస్తున్న ప్రకటనలు కూడా ఆ వాదనకు బలమిస్తున్నాయంటున్నారు. అడ్వకేట్ జనరల్‌గా ఉన్న వేణుగోపాల్‌ను తొలగించి కమ్మ సామాజికవర్గానికి చెందిన దమ్మాలపాటి శ్రీనివాస్‌ను నియమించారని, కాపులను పార్టీ అణచివేస్తుందని ఎమ్మెల్యే బొండా ఉమ బహిరంగంగానే ఆరోపించారని, రవాణాశాఖలో అవినీతి జరుగుతోందని ఆరోపించడమే కాకుండా ఆర్టీఏ కమిషనర్‌పై దాడికి విజయవాడ ఎంపి కేశినేని నాని యత్నించారని, విశాఖ భూముల్లో అవినీతి జరుగుతోందని స్వయంగా మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారని, విస్తరణ సందర్భంగా చింతమనేని ప్రభాకర్, బుచ్చయ్యచౌదరి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోని నాయకత్వం.. ఇప్పుడు ఐవైఆర్ విషయంలో ఆగమేఘాలపై స్పందించి వేటు వేయడం ఏమిటని బ్రాహ్మణ సంఘ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ చర్చ కింది స్థాయికి వెళితే పార్టీ నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.