ఆంధ్రప్రదేశ్‌

న్యాయపోరాటం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 20: రాష్ట్ర బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావును తొలగించడంపై న్యాయపోరాటం చేస్తామని అఖిల భారత బ్రాహ్మిన్ ఫెడరేషన్ యువజన విభాగం అధ్యక్షుడు ద్రోణంరాజు రవి తెలిపారు. 1983లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే కరణీకాల వ్యవస్థను రద్దు చేసిందని తెలిపారు. అప్పటి నుంచి బ్రాహ్మణులు తెలుగుదేశానికి దూరంగా ఉంటున్నారని గుర్తు చేశారు. సిఎంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక, బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా తెలుగుదేశానికి బ్రాహ్మణులు దగ్గరయ్యారన్నారు. అనేక కేసులను వాదించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను కాపాడిన అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్‌ను తొలగించడం తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మొదటి తప్పిదమన్నారు. ముందుగా ఎటువంటి నోటీసు వంటివి లేకుండా తొలగించారన్నారు. ఉరిశిక్ష వేసే ముందు కూడా మాట్లాడే అవకాశం ఇస్తారని, కానీ అటువంటివి లేకుండా కృష్ణారావును తొలగించారని విమర్శించారు. కృష్ణారావుకు మద్దతుగా వివిధ బ్రాహ్మణ సంఘ నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు.