ఆంధ్రప్రదేశ్‌

స్వయం సహాయక బృందం సభ్యులకు రూ. 10 వేల కనీస ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 20: మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు నెలకు కనీసం పదివేల రూపాయల చొప్పున ఆదాయం వచ్చే విధంగా చూడాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆదేశాల మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మహిళా సాధికారత, శిశు సంక్షేమం, సెర్ప్ శాఖల మంత్రి పరిటాల సునీత తెలిపారు. సెర్ప్ కార్యాలయంలో మంగళవారం 13 జిల్లాలకు చెందిన పిడిలు, ఏపిడిలతో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ఉన్న 71 లక్షల మంది స్వయం సహాయక సభ్యుల (ఎస్‌హెచ్‌జి) ఆదాయం పెరగడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారని, అందుకు అనుగుణంగా అధికారుల లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని కృషి చేయాలని చెప్పారు. అందులో భాగంగా ప్రపంచ బ్యాంక్, టాటా ట్రస్ట్‌తో వెలుగు సంస్థ ఎంవోయూ ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. మహిళల ఆదాయం కనీసం 10వేల రూపాయలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఇప్పటికి గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారని, అందుకోసం వ్యవసాయ ఆధారిత పథకాలు అమలుచేస్తే కుటుంబ ఆదాయాలు పెరుగుతాయన్నారు.ఇప్పటికీ ప్రభుత్వ పథకాల గురించి గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం మందికి తెలియకపోయినా, 70 శాతం మందికి అవగాహన ఉంటుందని చెప్పారు. ఈ విషయలపై అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ ఆధారిత పథకాల ద్వారా ఆదాయం పెంపొందించడానికి చేయూత ఇచ్చి, కనీస ఆదాయం 10 వేల రూపాయలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారన్నారు. అందుకోసం గ్రామాల్లో ఆవులు, మేకలు, గేదెల పాలద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునే చర్యలు పెద్దఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే గ్రామాల్లో ప్రజల ఆదాయం పెరుగుతుందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు స్కూళ్లలో ఇచ్చే యూనిఫామ్‌ల తయారీ బాధ్యత అప్పగించటంతో పాటు, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే ఎన్‌టిఆర్ క్యాంటిన్లలో కూడా ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న జనరిక్ మెడికల్ షాపుల్లో అవకాశం ఇచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయం తీసుకుని వారికి కావలసినవి ఇచ్చే విధంగా చేస్తే ఆదాయం పెంపుతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకుని తమ కుటుంబాలను పోషించుకునే అవకాశం మహిళలకు లభిస్తుందన్నారు.