రాష్ట్రీయం

ఐవైఆర్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఐవై ఆర్ కృష్ణారావుపై ప్రభుత్వం వేటు వేసింది. సామాజిక మాధ్యమం ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో తెలుగుదేశం పార్టీ నేత అయిన వేమూరి ఆనందసూర్యను నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో పాటు ఎపి ఎండోమెంట్స్ అర్చకులు, ఇతర ఉద్యోగుల సంక్షేమ ఫండ్ ట్రస్ట్ చైర్మన్ పదవుల నుంచి కూడా ఐవైఆర్ కృష్ణారావును తొలగిస్తూ జీఓ జారీ చేశారు. ఈ మేరకు రెవెన్యూ (ఎండోమెంట్స్-1) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి. సాంబశివరావు పేరుతో జీఓ (జీఓ ఎంఎస్ నెంబర్ 219, తేదీ 20-06-2017) జారీ అయింది. ఐవైఆర్ కృష్ణారావును రెండు సంస్థలకు చైర్మన్‌గా నియమిస్తూ 2016 జనవరి 29న రెండు జీఓలు వెలువడ్డాయి. జీఓలు వెలువడ్డ వారంలోగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాధారణంగా కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం నిర్ణయిస్తుండగా, కృష్ణారావుకు మాత్రం మూడు సంవత్సరాలు గడువు ఇచ్చారు. హైదరాబాద్‌లోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో కృష్ణారావుకు వసతి ఏర్పాటు చేయగా, అందులోనే ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే ఆయన రెండు కార్యాలయాలను విజయవాడకు తరలించారు. కృష్ణారావు పదవీబాధ్యతలు చేపట్టి ఒకటిన్నర సంవత్సరం గడచిపోయింది.
ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో కృష్ణారావు ‘పోస్ట్’లు పెట్టారన్నది ప్రధానమైన ఆరోపణ. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారుల ఎంపికలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వేశారని కూడా ఆయనపై అధికారపక్షం నేతలు, కార్యకర్తలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. వైఎస్‌ఆర్ సిపి నేతలతో సన్నిహితంగా మెలుగుతున్నారంటూ ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అన్నింటికీ మించి సామాజిక మాధ్యమంలో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన పోస్టులు అత్యంత వివాదాస్పదమయ్యాయి. కొన్ని పోస్టులను ఆయన స్వయంగా పోస్ట్ చేయగా, మరికొన్ని పోస్టులను వేరే వారివి ఆయన షేర్ చేశారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ప్రభుత్వం రాయితీలివ్వటాన్ని ఆయన తప్పు పట్టారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేసిన రవికిరణ్ అరెస్టుపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి కలవటంపై మరొకరు పెట్టిన పోస్టును ఆయన షేర్ చేయటం ఇంకా వివాదాస్పదమైంది. వీటన్నింటి నేపథ్యంలో మంగళవారం ఆయన్ను అన్ని పదవుల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కొత్త చైర్మన్‌గా ఆనంద్‌సూర్య
ఐవైఆర్‌ను తొలగించటంతోపాటే వెంటనే ఆయన స్థానాన్ని పార్టీ నాయకుడు వేమూరి ఆనంద సూర్యతో భర్తీ చేశారు. ఎపి బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్ కొత్త చైర్మన్‌గా వేమూరి ఆనంద సూర్యను నియమిస్తూ మంగళవారం సాయంత్రం మరో జీఓ రెవెన్యూ (ఎండోమెంట్స్-1) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి. సాంబశివరావు పేరుతో జారీ అయింది. చైర్మన్ పోస్టులో కొనసాగేందుకు కృష్ణారావుకు మూడు సంవత్సరాల గడవు ఇవ్వగా ఆనంద్ సూర్యకు రెండు సంవత్సరాలు మాత్రమే గడువు ఇచ్చారు.

చిత్రం.. వేమూరి ఆనందసూర్య