ఆంధ్రప్రదేశ్‌

పోలీసు శాఖ కోసం ప్రత్యేక యాప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 20: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖల మాదిరిగా పోలీస్ శాఖ కూడా అప్‌డేట్ అవుతోంది. ఆ శాఖ కోసం ఒక ప్రత్యేక యాప్ అందుబాటులోకి వచ్చింది. ‘ఖైజలా’ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ప్రత్యేక యాప్‌ను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) నుండి కానిస్టేబుల్ వరకు స్మార్ట్ఫోన్లలో నిక్షిప్తంచేసుకోవాల్సివుంటుంది. వాట్సాప్ మాదిరిగా ‘ఖైజాలా యాప్’ను రూపొందించారు. సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ను స్మార్ట్ఫోన్లు కలిగిన వారందరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని డిజిపి సాంబశివరావు ఆదేశాలు చేశారు. దీనితో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, డిఎస్‌పి, అడిషినల్ ఎస్పీ, ఎస్‌పి, డిఐజి, ఐజి, అడిషినల్ డిజి ఇలా అంతా స్మార్ట్ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకునే పనిలో ఉన్నారు. పోలీసు శాఖలో ఎప్పటికప్పుడు జారీఅయ్యే ఉత్తర్వులు, అధికారిక ఆదేశాలు తదితరాలన్నీ ఈ యాప్ ద్వారా వెంటనే కిందిస్థాయి వరకూ చేరుతాయి. అలాగే అత్యవసర సంఘటనల్లో అప్రమత్తం చెయ్యడం కోసం ఈ యాప్ ఉపయోగపడుతుంది. విధి నిర్వహణలో వివిధ సంఘటనా స్థలాలకు చేరుకున్న పోలీసు సిబ్బంది, అధికార్లు అప్పటికప్పుడు ఆ వివరాలు యాప్ ద్వారా అప్‌లోడ్ చేయడంవల్ల ఉన్నతాధికార్లకు క్షణాల్లో సమాచారం చేరుతుంది. అలాగే పోలీసు శాఖ లో ఉద్యోగాల వివరాలు, సమావేశాలు వాటి వివరాలు సైతం ఎప్పటికప్పుడు అందరికీ చేరుతుంటాయి. వీటితో పాటు పోలీసు బాస్ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఆకస్మిక తనిఖీలు, ఎస్పీల స్ధాయి నుంచి కానిస్టేబుల్ స్ధాయి వరకు బదిలీలకు సంబంధించిన వివరాలు ఈ ఖైజాలా యాప్‌లో ఎప్పటికప్పుడు పొందుపరుస్తుంటా రు. ముఖ్యంగ అన్ని స్థాయిలో పోలీసు అధికారులు సిబ్బంది విధుల్లో ఉన్నారా లేదా అన్నది కూడా ఈ యాప్ ద్వారా తెలుస్తుంది. ఇందులో వీడియోకాలింగ్ వంటి సదుపాయాలు ఉంటాయి. ఖైజాలాయాప్‌లో మా త్రం కేవలం పోలీసు శాఖకు సంబంధించిన సమాచారా న్ని మాత్రమే అప్‌డేట్ చేయడానికి అవకాశం ఉంటుంది.