ఆంధ్రప్రదేశ్‌

అనంత సర్వశిక్ష అభియాన్‌లో అక్రమాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, జూన్ 20: అనంతపురం జిల్లాలో సర్వశిక్ష అభియాన్‌లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి. మంజూరైన రూ.4 కోట్లను మళ్లించిన సిబ్బందిపై వేటు పడింది. అంతేగాక ఆమోదం తెలిపిన బడ్జెట్ కన్నా ఎక్కువ నిధులు కాంట్రాక్టర్లకు చెల్లించారు. ఈ అక్రమాలు ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడి శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీలో వెలుగుచూశాయి. వివరాలు ఇలా ఉన్నాయి. సర్వశిక్ష అభియాన్ కింద వివిధ పనులకు కేటాయించిన రూ.4 కోట్లను సివిల్ పనులకు మళ్లించారు. అదే విధంగా సివిల్ పనుల కోసం రాష్ట్ర ఎస్పీడి రూ.9.81 లక్షలకు ఆమోదం తెలిపితే కాంట్రాక్టర్లకు ఏకంగా రూ. 13.30 లక్షలు చెల్లించారు. సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు తనిఖీల్లో తేలింది. డిఎల రూపంలో లక్షలకు లక్షలు స్వాహా చేశారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు ఖర్చు చేయాల్సిన రూ.కోటి సివిల్ పనులను మళ్లించారు. సిబ్బందికి సరిగా వేతనాలు కూడా ఇవ్వడం లేదు. మంగళవారం జిల్లా ఎస్‌ఎస్‌ఏ కార్యాలయాన్ని ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడి శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేయడంతో వాస్తవాలు వెలుగుచూశాయి.
అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై వేటు వేశారు. రిజిస్ట్రర్‌లో సంతకం చేయకండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన డిఈలను సొంత శాఖకు బదలాయించారు. విధులకు రాని కంప్యూటర్ ఆపరేటర్లు రఘునాథ్, రాఘవేంద్రను విధుల నుంచి తొలగించారు. పిఓ దశరథరామయ్య, ఐఈ కోఆర్టినేటర్ పాండురంగడు, జిసి డిఓ వాణిదేవి, అసిస్టెంట్ అలెస్కో శ్రీదేవి, అసిస్టెంట్ సిఎంఓ కిష్టప్ప, డిఈలు మురళీధర్, రంగస్వామిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయశంకర్‌కు చార్జిమెమో జారీ చేశారు. వీరిని సస్పెండ్ చేయాలని విద్యాశాఖకు సిఫార్సుచేశారు.