ఆంధ్రప్రదేశ్‌

రాజధానికి శుద్ధజలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 20: అభివృద్ధి అనేది ఏ ఒక్కరో అడ్డుకుంటే ఆగేదికాదు.. నాడు భూ సమీకరణ కింద రైతులు భూములిచ్చారు.. ఇవ్వొద్దని రెచ్చకొట్టారు.. ఇప్పుడు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి అంకురార్పణ జరిగింది.. ప్రజల విశ్వసనీయత ఉంటే అవరోధాలు ఉండవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలకు తాగునీరు, పౌష్టికాహారం తప్పని సరన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఎన్టీఆర్ ట్రస్టు ఏర్పాటుచేసిన సుజల పథకాన్ని, హరిశ్చంద్రపురంలో ఏర్పాటుచేసిన ప్లాంట్‌ను రిమోట్ ద్వారా ముఖ్యమంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాజధాని ప్రతిపాదిత 29 గ్రామాల ప్రజలకు రూ. 2కే 20 లీటర్ల క్యాన్‌ను అందజేస్తారు. దీనివల్ల రెండు లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం కలుషితమైన ఆహారం, నీటిని సేవించటం వల్ల ప్రజలు అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారని, కాలుష్య కోరల్లోంచి కాపాడేందుకే ఎన్‌టిఆర్ సుజల పథకాన్ని ఏర్పాటు చేసామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలతో కాలుష్య సమస్య తలెత్తకుండా నీటిని పంపిణీ చేస్తారన్నారు. శుద్ధమైన జలాన్ని వినియోగించటంతో పాటు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని భుజించాలని సూచించారు. తెలుగుజాతి గర్వించదగిన మహానేత ఎన్‌టిఆర్ పేరుతో సుజల పథకాన్ని అమలు చేయటం అభినందనీయమన్నారు. ఇప్పటికే బసవరామతారకం క్యాన్సర్ ట్రస్టు ద్వారా బాధితులను ఆదుకుంటున్నారని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిరుపేద క్యాన్సర్ రోగులకు వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో చెత్తలేకుండా పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. మురుగుకాల్వల వ్యవస్థను ఎప్పటికప్పుడు మెరుగు పరచటంతో పాటు రాజధానిలో చెత్తను నిర్దేశించిన గార్బేజికి తరలించాలన్నారు. ప్లాంట్ ఏర్పాటుకు సహకరించిన నిర్వాహకులను సిఎం ఈ సందర్భంగా సత్కరించారు. కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, నక్కా ఆనంద్‌బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపిలు గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌కుమార్, జివి ఆంజనేయులు, కలెక్టర్ కోన శశిధర్, సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, రాజధాని ప్రాంత రైతులు పాల్గొన్నారు.

చిత్రం.. జెండా ఊపి శుద్ధజలాల ట్యాంకర్లను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి