ఆంధ్రప్రదేశ్‌

ఓలాతో ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 20: దేశీయ, అంతర్జాతీయ పర్యాటకానికి తోడ్పాటు అందించటంతో పాటుగా రాబోయే ఐదేళ్లలో 25వేల ఉద్యోగావకాశాలను సృష్టించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఓలా సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎక్స్‌క్లూజివ్ కో బ్రాండెడ్ ఓలా, ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్ల మొదటి బ్యాచ్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపి టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ హిమాంశుశుక్లాతో పాటుగా ఓలా అమరావతి ఫౌండింగ్ పార్టనర్ ప్రణయ్‌జివ్‌రాజ్కల మధ్య అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. ఆరు నగరాల్లోని 30కు పైగా కీలక పత్రాల్లో రైడ్స్ బుకింగ్ కోసం ఓలా సంస్థ కియోస్క్‌లను ఏర్పాటు చేయనుంది. డ్రైవర్లలో నైపుణ్యాన్ని మెరుగుపరచేందుకు అలాగే కీలక పర్యాటక ప్రాంతాలు, వాటి చరిత్ర, సంస్కృతి, తదితర అంశాల పట్ల అవగాహన పెంచేందుకు శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. ఎయిర్‌పోర్టులు, రైల్వే, బస్‌స్టేషన్లు, హరిత హోటల్స్ అండ్ రిసార్ట్స్ వంటి చోట ఉన్న ఏపి టూరిజం కౌంటర్లలో రెవెన్యూ ఫేర్ పద్ధతిలో బుక్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ అమరావతిని అతి పెద్ద నగరంగా తీర్చిదిద్దాలనేది తన లక్ష్యంగా చెప్పారు. ఓలా లాంటి ఏకరీతి ఆలోచనలు కల్గిన కంపెనీల భాగస్వామ్యంతో తమ లక్ష్యాన్ని సాధించుకోగలమనుకుంటున్నామన్నారు. పర్యాటకశాఖ, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా మాట్లాడుతూ రవాణా సౌకర్యాలు మరింతగా మెరుగుపరచడం ద్వారా పర్యాటకులతో పాటుగా రాష్టవ్రాసులకు గణనీయంగా లబ్ది కలుగనుందన్నారు. ఓలా ఫౌండింగ్ పార్టనర్ ప్రణయ్‌జివ్‌రాజ్క మాట్లాడుతూ భారతదేశంలో సమ్మిళిత అభివృద్ధికి బెంచ్‌మార్క్‌గా ఆంధ్రప్రదేశ్ నిలువబోతుందని తాము గట్టిగా నమ్ముతున్నామని అన్నారు. ఏపి టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ హిమాంసు శుక్లా మాట్లాడుతూ స్థానికంగా సంబంధిత మొబిలిటి పరిష్కారాలను అందించాలనే ఓలా నిబద్ధత, భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలను సృష్టించాలనే తమ ప్రయత్నాలు విజయవంతమయ్యేందుకు ఈ ఒప్పందం దోహదపడగలదన్నారు.

చిత్రం.. ఓలా కార్లను జెండా ఊపి ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి