ఆంధ్రప్రదేశ్‌

చేపల వేట బోట్లకు విధిగా రిజిస్ట్రేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 22: సముద్రంలో వేట సాగించే మత్యకారుల భద్రత, రక్షణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కోస్తా తీర ప్రాంతంలో సముద్రంలో వేట విరామం అనంతరం మత్స్యకారుల కార్యకలాపాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈనేపథ్యంలో లోతైన సముద్ర జలాల్లో రోజుల తరబడి వేట సాగించే జాలర్ల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ప్రభుత్వం స్పష్టంచేసింది. ముఖ్యంగా ఇకపై సముద్రంలో వేటకు వెళ్ళే మత్స్యకారులు తమ పడవలను మత్స్యశాఖ వద్ద తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవల్సి ఉంటుంది.
రిజిస్టర్ కాని బోట్లను ఎట్టిపరిస్థితుల్లో వేటకు అనుమతించరాదని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లాలో ఐదుగురు ఎఫ్‌డిఒ స్థాయి అధికారులను నియమించారు. జిల్లాలో వేట సాగిస్తున్న పడవలను 5 కేటగిరీలుగా విభజించారు. ఎంఎఫ్‌వి-1, ఎంఎఫ్‌వి-2, ఎంసి, సిసి-1, సిసి-2 రకాలుగా పడవలను పేర్కొంటున్నారు. జిల్లాలో 471 ఎంఎఫ్‌వి-2 వెసల్స్ ఉండగా, 2888 మోటరైజ్డ్ క్రాప్ట్‌లు, 253 సిసి-1, సిసి-2, కంట్రీక్రాఫ్ట్ రకాల వేట పడవలు ఇప్పటికే రిజిస్టర్ అయ్యాయి. ఎంఎఫ్‌వి రకం పడవలు 8నుండి 12 మంది సిబ్బందితో 7నుండి 14 రోజులు సముద్రంలో వేట సాగించగలవు. ఎంసి పడవలు ఐదు నుండి ఏడుగురు సిబ్బందితో 3నుండి 6రోజుల పాటు వేట సాగిస్తాయి. కంట్రీక్రాఫ్ట్ పడవలు 2నుండి నలుగురు సిబ్బందితో ఒకరోజు మాత్రమే వేటాడే అవకాశం ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ఆయా పడవల్లో ఇంధనం, ఆహారం, తాగునీటిని భద్రపరచుకుని వేటకు వెళ్తారు.
వేట సాగిస్తున్న రిజిస్టర్ కాని అన్ని రకాల పడవలను విధిగా రిజిస్టర్ చేయించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఆయా పడవల్లో లైఫ్ సేవింగ్ ఎక్విప్‌మెంట్, నావిగేషన్ ఎక్విప్‌మెంట్, డిస్ట్రెస్ అలారం, ట్రాన్స్‌మీటర్ (టాట్) పరికరాలను విధిగా ఉంచుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వేటకు వెళ్ళేటపుడు స్థానిక గ్రామ పెద్దలకు, మత్స్యశాఖ, మెరైన్ పోలీసులకు సదరు జాలర్లు విధిగా తెలియజేయాలని ప్రభుత్వ యంత్రాంగం స్పష్టంచేసింది. వేట ముగించుకుని ఆయా గ్రామాలకు చేరిన జాలర్లు ఈ సమాచారాన్ని కూడా అధికారులకు విధిగా తెలియజేయాలని సూచించారు. వేటకు వెళ్ళిన మత్యకారులు నడి సముద్రంలో ఒకరికొకరు సహాయంగా ఉండేందుకు గ్రూప్ ఫిషింగ్ విధానాన్ని పాటించాలని, బోట్ల ఇంజన్ల వైఫల్యాల నివారణకు మంచి మెయింటినెన్స్, కండిషనింగ్‌ను తరచూ చేయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జాలర్లకు రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం సబ్సిడీపై రక్షణ పరికరాలను అందజేస్తోందని, మత్స్యకారులు తమ భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న ఉపకరణాలను సద్వనియోగం చేసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సూచించారు.