ఆంధ్రప్రదేశ్‌

సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు త్వరలో డైట్ ఛార్జీల పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 23: సాంఘిక, గిరిజన, సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారికి పౌష్టికాహారం అందించేందుకు త్వరలో డైట్ ఛార్జీలను పెంచనున్నట్లు సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్ బాబు వెల్లడించారు. విజయవాడలోని ఒక హోటల్‌లో 16వ నోడల్ ఏజెన్సీల సమావేశాన్ని మంత్రి నక్కా ఆనంద్ బాబు శుక్రవారం నిర్వహించారు. సమావేశానికి సంబంధించిన విషయాలను అనంతరం ఆయన మీడియా ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు 15 నోడల్ ఏజెన్సీ సమావేశాలు నిర్వహించారని, తాను మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇది మొదటి సమావేశం అని చెప్పారు. ఉదయం నుంచి జరుగుతున్న సమీక్ష సమావేశంలో 39 శాఖలకు సంబంధించిన కార్యదర్శులు, శాఖాధిపతులు పాల్గొన్నారన్నారు. 2016-17 సంవత్సరంలో 43 శాఖలకు కేటాయించిన నిధులు, ఖర్చు ఎలా జరిగింది.. పూర్తి స్థాయిలో నిధులు ఖర్చు పెట్టారా, పెడితే పారదర్శకంగా ఉందా, పెట్టిన ఖర్చు వల్ల దళిత, గిరిజనులకు, ఇతర వర్గాల వారికి మధ్య ఉన్న అంతరాలు ఎంతవరకు తగ్గాయన్న విషయాలపై కూలంకషంగా చర్చించామన్నారు. కొన్ని ముఖ్య శాఖలైన పంచాయతీ రాజ్, ఆర్‌డబ్ల్యుయస్, గ్రామీణాభివృద్ధి శాఖలలో పూర్తిస్థాయిలో నిధులు ఖర్చు జరిగిందని, మరికొన్ని శాఖలలో ఉప ప్రణాళికా నిధులను అసలు ఖర్చు చేయలేకపోయారని తెలిపారు. ఖర్చు చేయని శాఖల నుండి వివరణలను అడిగి, గట్టిగా హెచ్చరికలు జారీ చేశామని మంత్రి తెలిపారు. గత సంవత్సరం 43 శాఖలకు సంబంధించిన 203 పథకాలకు నిధులను కేటాయించామన్నారు. ఈ సంవత్సరం 39 శాఖలకు సంబంధించి 179 పథకాలకు నిధులు కేటాయించామన్నారు. జిల్లా స్థాయిలో కూడా ఉప ప్రణాళికా అమలుపై పర్యవేక్షించేందుకు మానిటరింగ్ కమిటీలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా 40 శాతం జనాభా ఉన్న ఎస్‌సి కాలనీల్లో ఉప ప్రణాళికా నిధులతో సిమెంటు రోడ్లు నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాలలో వౌలిక సదుపాయాలైన విద్య, ఆరోగ్యం, మంచినీరు, రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తున్నామన్నారు. నాణ్యమైన విద్యతో పాటు, పౌష్టికాహారాన్ని అందించేందుకు త్వరలో డైట్ ఛార్జీలను పెంచేందుకు ప్రతిపాదనలను తయారు చేస్తున్నామని, డైట్ ఛార్జీల పెంపుకు ముఖ్యమంత్రి ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించినట్లు మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు.