ఆంధ్రప్రదేశ్‌

ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 23: ముస్లింల సంక్షేమాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కట్టుబడి ఉంటుందని ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నగరంలోని ఎపిసిసి కార్యాలయంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం అన్న సిద్ధాంతం ప్రకారం భారతదేశంలో విభిన్న మతాలు, కులాలు, వర్గాలున్న తరుణంలో అందరినీ సమానంగా పరిగణిస్తూ లౌకికవాదాన్ని పరిరక్షించిన పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని, కాంగ్రెస్ పాలనలోనే ముస్లింలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుత పాలక వర్గంలో కనీసం ఒక్కరైనా ముస్లిం మంత్రి లేకపోవడం బాధాకరమన్నారు. మంత్రి పదవి ఇవ్వడానికి ఇష్టపడని తెలుగుదేశం పార్టీ నేతలు ఇక ముస్లింలను తామే ఉద్ధరిస్తామని నమ్మపలుకుతున్న వైనం గర్హనీయమన్నారు. ముస్లింల అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కట్టుబడి ఉన్నట్టుగానే వారికి ఎటువంటి ఆపద, సమస్యలొచ్చినా తొలుతగా స్పందించేది కాంగ్రెస్ మాత్రమేనని ఉద్ఘాటించారు. పవిత్ర రంజాన్ పండుగ రోజులలో అందరూ పరమత సహనంతో ప్రవర్తించాలని, ముస్లిలంను గౌరవిస్తూ వారి సాంప్రదాయలను కాపాడలని పేర్కొంటూ రాష్ట్ర ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తొలుత మత గురువు అల్తాఫ్ రజా పవిత్ర ఖురాన్ పఠనం చేశారు. ఈకార్యక్రమంలో మైనార్టీ సెల్ రాష్ట్ర చైర్మన్ సలీమ్ పర్వేజ్, పిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శి దుర్బేస్ హుస్సేన్, గుంటూరు జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ సలీమ్, పిసిసి అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ, కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లాది విష్ణు, మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం సుంకర పద్మశ్రీ, కుర్షిదా ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ చేశారు.