ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశం జిల్లాలో కొత్తగా నాలుగు బార్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూన్ 24:రాష్ట్రప్రభుత్వం మద్యం బార్లకు లాటరీ పద్ధతిలో లైసెన్స్‌లను మంజూరు చేసే ప్రక్రియకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ప్రకాశం జిల్లాలో బార్లకు లైసెన్స్‌లు పొందేందుకు మద్యం వ్యాపారులు పరుగులు తీసే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని ఒంగోలు,చీరాల, కందుకూరు, మార్కాపురం ప్రాంతాల్లో ఇప్పటివరకు 30 మద్యం లైసెన్స్ బార్లు ఉండగా కొత్తగా మరో నాలుగు బార్లు మంజూరు అయ్యాయి. 50వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో ఎనిమిది లక్షల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు, రెండులక్షల రూపాయల లైసెన్స్ ఫీజు, 50వేల పైన జనాభా ఉన్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఫీజు 18లక్షల రూపాయలు, లైసెన్స్‌ఫీజు రెండు లక్షల రూపాయలను వసూలు చేయనున్నారు. జిల్లాకు అదనంగా అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు ప్రాంతాల్లో కొత్తగా వచ్చిన నాలుగు మద్యంబార్లను ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 29వతేదీతో జిల్లాలోని 34 మద్యం బార్లకు దరఖాస్తులకు స్వీకరణ గడువుముగుస్తుందని జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జోసఫ్ ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. ఈనెల 30న లాటరీ పద్ధతిలో బార్లను కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. లాటరీపద్ధతిలో బార్ల ఎంపిక జరగనున్న నేపధ్యంలో మద్యం వ్యాపారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అందులోభాగంగా ఒక్కొక్క బారుకు పదుల సంఖ్యలో దరఖాస్తులు వేసేందుకు దరఖాస్తుదారులు సమాయత్తవౌతున్నారు. కాగా దరఖాస్త్ఫుజు రెండు లక్షల రూపాయలు చెల్లించిన తరువాత లాటరీలో రాకపోతే రెండు లక్షల రూపాయలను ప్రభుత్వం తిరిగి ఇవ్వదు. దీంతో రాష్ట్రప్రభుత్వానికి అత్యధిక ఆదాయం రానుంది. కాగా మద్యం వ్యాపారులు సిండికేట్‌గామారి వారే ఎక్కువ దరఖాస్తులు వేసుకుని లాటరీ వచ్చిన తరువాత ఆ బారును నడిపే విధంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా జిల్లావ్యాప్తంగా ఉన్న మద్యంషాపులకు అనుబంధంగా ల్టుషాపులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ విషయం మాత్రం ఎక్సైజ్ శాఖాధికారులకు పట్టడటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఉన్న బెల్టుషాపులను తొలగించాలని మహిళలు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికి వాటిని తొలగించటంలో మాత్రం ఎక్సైజ్ శాఖాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంమీద జిల్లా వ్యాప్తంగా బార్లకు లైసెన్స్ మంజూరు ప్రక్రియ మొదలుకానుంది.