ఆంధ్రప్రదేశ్‌

భూ బకాసురులను జైలుకు పంపుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, (జగదాంబ) జూన్ 24: రాష్ట్రంలో భూకుంభకోణాలకు పాల్పడిన ప్రతిఒక్కరిపై కేసులు పెట్టి జైలుకు పంపుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. విశాఖలో జెడ్‌పి సమావేశ మందిరంలో నిర్వహించిన డిఆర్‌సి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 15 ఏళ్ళ కిందట చేసిన తప్పిదాలు కారణంగానే కుంభకోణాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విచారించేందుకు ఏర్పాటు చేసిన సిట్ విచారణ ప్రారంభమైందన్నారు. ఈ భూ కుంభకోణాల్లో అధికారులు తప్పుజేస్తే వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని, గడచిన పదేళ్ళ నుంచి భూ కుంభకోణాల్లో కీలకంగా ఉన్న అధికారులను వారి హయాంలో చేసిన ట్యాంపరింగ్ తదితర విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ల్యాండ్ పూలింగ్‌కు విశాఖలో ఒకసారి మాత్రమే ఒక గ్రామానికి జీవో జారీ చేశామని, ముదపాకలో ల్యాండ్ పూలింగ్ జరగలేదని, ఇక్కడి సమస్య ప్రస్తుతం పోలీసు విచారణలో ఉందని, త్వరలోనే భూ దందాలకు పాల్పడిన వారి వివరాలను బహిర్గతం చేస్తామన్నారు. అనంతరం అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఎక్కడ చేపట్టినా ఒకే విధానంలో చేపట్టాలని ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా చేయడంతో పలు సమస్యలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రోడ్లు, భవనాలశాఖకు చెందిన రూ. ఐదు వేల కోట్ల విలువైన భూములు ఆస్తుల రూపంలో ఉన్నాయని, అవి ఎక్కడ ఉన్నాయో ఆ శాఖాధికారులకే తెలియని పరిస్థితుల్లో ఉందన్నారు. ఇప్పటికైనా అన్ని శాఖల అధికారులు జిల్లాలో ఏఏ శాఖలో ఎంతెంత భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయా శాఖల ఉన్నతాధికారులపై ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో అన్ని నియోజక వర్గాల్లోని భూ సమస్యలపై చర్యలు చేపట్టాలంటూ ఎమ్మెల్యేలంతా ఇన్‌చార్జి మంత్రికి మొరపెట్టుకున్నారు. ఈ సమావేశంలో విశాఖ ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు, బిజెపి ఫ్లోర్‌లీడర్ పి విష్ణుకుమార్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. డిఆర్‌సి సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి చినరాజప్ప