ఆంధ్రప్రదేశ్‌

మైలవరం నుంచి బాలయ్య పోటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 24: హిందుపురం ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి చంద్రబాబు వియ్యంకుడైన నందమూరి బాలకృష్ణ వచ్చే ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ మేరకు సురక్షిత స్థానం కోసం అనే్వషణ ప్రారంభించినట్లు తెలిసింది. అందులో భాగంగా ప్రస్తుతం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తోన్న మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం హిందుపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బాలకృష్ణపై స్థానికంగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆయన ప్రజలకు అందుబాటులో ఉండకపోగా, ఆయన పీఏ వివాదం పార్టీని అప్రతిష్ఠపాలు చేసిన విషయం తెలిసిందే. కార్యకర్తలు, నేతలపై చిర్రుబుర్రులాడుతున్న వైనంపైనా అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనితో వచ్చే ఎన్నికల్లో కృష్ణా జిల్లా సురక్షితమైనదన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అందులో భాగంగా పెనమలూరు, గుడివాడ నియోజకవర్గాలను పరిశీలించగా.. గుడివాడలో కమ్మ సామాజికవర్గంలో చీలికలతోపాటు, కాపు వర్గం బలంగా ఉండటం, గతంలో పార్టీ నుంచి బయటకు వచ్చిన నందమూరి హరికృష్ణ అక్కడి నుంచి పోటీచేసి ఓడిపోయిన వైనాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ కుమారుడైనప్పటికీ గుడివాడ ప్రజలు ఆయనను తిరస్కరించారు. ఇక పెనమలూరులో కమ్మ సామాజికవర్గం ఆధిపత్యం ఎక్కువగా ఉన్నప్పటికీ, అక్కడి నుంచి దివంగత దేవినేని నెహ్రూ తనయుడైన దేవినేని అవినాష్‌కు స్థానం కల్పిస్తామని బాబు గతంలోనే హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అంత చురుకుగా వ్యవహరించడం లేదన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ యంత్రాంగం, కమ్మ వర్గ ప్రాబల్యం, బీసీలు ఎక్కువగా ఉన్న మైలవరం నియోజకవర్గమే బాలయ్యకు అత్యంత సురక్షితమైనదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. పైగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తోన్న మంత్రి దేవినేని ఉమపై వ్యతిరేకత పెరగడం, అనేక అవినీతి ఆరోపణలు వస్తున్న విషయాన్ని పార్టీ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ప్రస్తుతం ఆయనకు వ్యతిరేకంగా సీనియర్లు ఒకటవుతున్నారు. నియోజకవర్గంలో మరొకరిని ఎదగనీయడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో బాలకృష్ణ అక్కడ పోటీ చేస్తే నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న గౌడ, యాదవ వర్గాలు మూకుమ్మడిగా బాలయ్యను గెలిపిస్తారని అంచనా వేస్తున్నారు. అయితే, అందుకు ప్రతిగా ఉమాకు విజయవాడ ఎంపి, లేదా ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు. హిందుపురం ఎమ్మెల్యేగా ఉన్న ఘనీకి అవకాశం ఇవ్వకుండా, బాలయ్యకు అవకాశం ఇచ్చిన విషయాన్ని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. మంత్రిగా తన కార్యకలాపాలన్నీ ఎక్కువగా విజయవాడ కేంద్రంగానే కొనసాగిస్తున్నందున, ఉమ ఎంపిగా పోటీ చేస్తే కులబలం-పార్టీ ఇమేజ్ కలసి వస్తాయని విశే్లషిస్తున్నాయి.