ఆంధ్రప్రదేశ్‌

బాబు వ్యాఖ్యలపై ఈసికి ఫిర్యాదు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 24: కర్నూలు జిల్లా ఉండగా నంద్యాల ఉప ఎన్నిక నేపధ్యంలో అక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలకడ తప్పి మాట్లాడారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఓటుకు రూ.5వేలు ఇస్తానని సాక్షాత్తు ముఖ్యమంత్రే బహిరంగంగా ప్రకటించినందున దీనిపై ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయనున్నట్లు రామకృష్ణ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో రెండు నెలలుగా నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలనిమాండ్ చేశారు. ఈ గ్రామంలో ఇతర నేతల విగ్రహాలతో పాటు రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడి దళితులు ఏర్పాటు చేశారన్నారు. అయితే అగ్రకులాలకు చెందినవారు జీర్ణించుకోలేక అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడమే కాకుండా దళితులను గ్రామం నుంచి బహిష్కరించడం దారుణమన్నారు. గరగపర్రు ఘటనపై విచారణ జరిపిన జాయింట్ కలెక్టర్ దళిత వర్గాలకు వ్యతిరేకంగా అగ్రవర్ణాలకే మద్దతు తెలియజేశారన్నారు. ఈ విషయమై నలుగురు సభ్యులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీని సిపిఐ రాష్ట్ర సమితి ఆదివారం గరగపర్రు గ్రామానికి పంపిస్తోందన్నారు. ఇలాఉంటే రాష్టప్రతి అభ్యర్థిగా మీరాకుమార్‌ను బలపరచాలని వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని రామకృష్ణ కోరారు.