ఆంధ్రప్రదేశ్‌

పనిచేసి ఓట్లు అడుగుతున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 24: తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పనిచేసి చూపించి ప్రజలను ఓట్లు అడుగుతుంటే, విపక్షాలు ప్రజలను నిలువునా మోసం చేసి ఓట్లు అడుగుతున్నాయంటూ రాష్ట్ర గనులశాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు ధ్వజమెత్తారు. ప్రజల సొమ్ముతో తాజ్‌మహల్‌ను తలదనే్నలా విలాస భవనాలు, విదేశాల్లో పరిశ్రమలు, ఇడుపులపాయలో ఇంటి ముందు రోడ్లు నిర్మించుకున్న చరిత్ర తల్లి, పిల్ల కాంగ్రెస్‌లదేనని శనివారం ఒక ప్రకటనలో మంత్రి విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించి ఓట్లు అడుగుతుంటే తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు ప్రజలను నిట్టనిలువునా మోసం చేసి ఓట్లు అడుగుతున్నాయంటూ విమర్శించారు. వైఎస్ హయాంలో కేంద్రం రూ.400 పెన్షన్ ఇస్తే రూ.200 మింగి రూ.200 మాత్రమే వృద్ధులకు ఇచ్చి వారి నోటికాడ కూడు తిన్నారన్నారు. అంతేకాకుండా రెండు వందలు పెన్షన్ ఇచ్చిన వైఎస్‌కు ఓటు వేయమని వైకాపా పదే పదే ప్రచారం చేయలేదా.. తెలంగాణా ఇచ్చాం కాబట్టి తమకు మద్దతు ఇవ్వమని రాహుల్‌గాంధీ కోరలేదా.. అని ప్రశ్నించారు. పంట పొలాలకు నీళ్లిస్తామని రైతులను నమ్మించి ఓట్లేయించుకున్న తర్వాత ఒక్క ఎకరాకు కూడా నీరివ్వకుండా జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసి రూ.90వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన చరిత్ర మీది కాదా అన్నారు. మూడేళ్లలో సాగునీటి రంగానికి రూ.22వేల కోట్లు ఖర్చుపెట్టి 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి ప్రాధాన్యత ప్రకారం ప్రాజెక్టులు పూర్తిచేస్తూ, నదుల అనుసంధానానికి కూడా శ్రీకారం చుట్టిన తాము ఓట్లు అడగడం తప్పా అన్నారు. 2019 నాటికి రాష్ట్రంలో పరిస్థితులపై ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన నివేదికతో తల్లి, పిల్ల కాంగ్రెస్ నేతలకు మైండ్ బ్లాక్ అయిందన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ఆయుధాలుగా ప్రజల్లోకి వెళుతున్న చంద్రబాబునాయుడును అడ్డుకోలేమనే దురుద్దేశంతోనే ఆయన మాటలు వక్రీకరించి కట్టుకథలతో దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అన్నారు. చంద్రబాబునాయుడు కుటుంబం 20 ఏళ్లపాటు రాత్రింబవళ్లు కష్టపడి హెరిటేజ్ సంస్థను ఏర్పాటు చేస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాత్రికి రాత్రే సూట్‌కేసు కంపెనీలు ఏర్పాటుచేసి వేల కోట్ల రూపాయల నిధులు మళ్లించిన చరిత్ర తల్లి, పిల్ల కాంగ్రెస్ నేతలదని అన్నారు.