ఆంధ్రప్రదేశ్‌

ఇది సైద్ధాంతిక పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 24: ప్రస్తుతం జరగబోతున్న రాష్టప్రతి ఎన్నికలు కేవలం సైద్ధాంతిక పోరే కానీ ఇద్దరు దళితుల మధ్య పోరు కాదని ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. బిజెపికి మద్దతు ఇచ్చేవారందరూ మనువాదానికి మద్దతు ఇచ్చేవారేనని, ప్రస్తుతం బిజెపి తరఫున రాష్టప్రతి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలతో కూడిన మనువాదేనని ఆయన మండిపడ్డారు. శనివారం ఉదయం నగరంలోని ఎపిసిసి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో రఘువీరా మాట్లాడుతూ గత ముస్లింలు, దళితులు, దళిత క్రిస్టియన్ మైనార్టీలకు రిజర్వేషన్లను కల్పించాలని చెప్పే రంగ్‌నాథ్ మిశ్రా కమిషన్‌ను రామ్‌నాథ్ కోవింద్ వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. దళిత కుటుంబంలో జన్మించినప్పటికీ దళితాభ్యుదయ భావాల కన్నా దళిత వ్యతిరేక భావాలు కలిగిన వ్యక్తి రాష్టప్రతి ఎలా అవుతారని రఘువీరా ప్రశ్నించారు. ఎన్‌డిఎతో భాగస్వామిగా ఉన్న టిడిపి ఇక్కడ రాష్ట్రంలో ముస్లీం, గిరిజన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వని వైనం కూడా దళిత వ్యతిరేక విధానాలకు తార్కాణమన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల రక్తం పంచుకు జన్మించిన కాంగ్రెస్ అభ్యర్థి మీరాకుమార్ భారత దేశానికి విశేష సేవలందించిన బాబూ జగ్జీవన్ రామ్ కుమార్తె అన్నారు. రాష్టప్రతి ఎన్నిక సామాన్య ప్రజలు ఓట్లు వేయకపోయినా, సామాన్యుల చేత ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటర్లు కాబట్టి ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా వారు ఓటు వేయాల్సిన అవసరం ఉందన్నారు. రంగ్‌నాథ్ మిశ్రా కమిషన్ నివేదికను బలపర్చేవారికి ఓటు వేస్తారా.. లేక వ్యతిరేకించే వారికి ఓటు వేస్తారా అనే విషయాన్ని గుర్తించాలన్నారు. దళితు వ్యతిరేక భావాలు కలిగిన వారికి మద్దతు తెలపాల్సిన అవసరం లేదన్నారు. సైద్ధాంతిక ఎన్నికల పోరులో దళితాభ్యున్నతి భావాలున్న మీరాకుమార్‌కు మద్దతు తెలపాల్సిందిగా జూలై 17వ తేదీ రాష్టప్రతి ఎన్నిక వరకూ రాష్ట్రంలోని టిడిపి, వైసిపి మీద ఒత్తిడి చేయడమే కాకుండా వెంటాడతామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎఐసిసి కార్యదర్శి సాకే శైలజానాధ్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు, తదితరులు పాల్గొన్నారు.