ఆంధ్రప్రదేశ్‌

గుజరాత్‌లో ముగిసిన నారాయణ బృందం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 24: అమరావతి నిర్మాణంలో అత్యుత్తమ పద్ధతులు అవలంబించేందుకు, అత్యుత్తమ సౌకర్యాలు కల్పించేందుకు పురపాలక మంత్రి నారాయణ నేతృత్వంలోని సిఆర్డీఏ బృందం దేశ విదేశాల్లోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తోంది. అందులో భాగంగా శనివారం గుజరాత్ రాష్ట్రాన్ని సందర్శించింది. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో సచివాలయం, ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలు, అసెంబ్లీ, శాఖాధిపతుల కార్యాలయాలు, గాంధీ మెమోరియల్, దండి కుటీర్, కకారియా లేక్, ఏక్తా స్టేడియం, రోడ్లు, పార్కులు, తదితర ప్రాంతాలను బృందం సందర్శించింది. ముఖ్యంగా గాంధీనగర్ నిర్మాణంలో ప్రణాళికాపరమైన, నిర్మాణ పరమైన అంశాలను అక్కడి ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి సుదీర్ఘంగా చర్చించారు. ప్లానింగ్‌కు వచ్చే ఇబ్బందులు, నిర్మాణంలో జరిగే లోపాలు సమావేశంలో అక్కడి సిబ్బంది వివరించారు. వారి అనుభవ సారాన్ని తెలుసుకోవడం ద్వారా మనం రాజధాని నిర్మాణంలో ఎలాంటి తప్పులూ జరగకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందని, అందుకే ఈ పర్యటన మొత్తం లోపాలు, సమస్యలు అధ్యయనం చేయడానికి బాగా ఉపయోగపడిందని పురపాలక మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ పర్యటనలో మంత్రి నారాయణతో పాటు సిఆర్టీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, ప్లానింగ్ డైరెక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.