ఆంధ్రప్రదేశ్‌

అన్నింటినీ తప్పు పట్టడమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 24: ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని తప్పు పట్టడం ప్రతిపక్షాలకు అలవాటైందని, ఇది సరైన విధానం కాదని రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విజయవాడలోని కృష్ణాజిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం జరిగిన మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం ప్రతిపక్ష పార్టీలకు అలవాటుగా మారిందన్నారు. గడిచిన మూడేళ్ళల్లో తమ ప్రభుత్వం రాష్ట్రంలో సాధించిన పురోభివృద్ధిని వివరించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి ప్రధాన అజెండాగా తీసుకుని పని చేస్తున్నామన్నారు. కేవలం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమ కార్యక్రమాల అమలుకు 65వేల కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించామన్నారు. అదేవిధంగా యూత్ పాలసీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సుమారు 700 కోట్ల రూపాయలు బడ్జెట్‌లో పొందుపరిచామన్నారు. అన్ని రంగాల్లో కూడా నేడు రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధించిందన్నారు. పాలనాపరంగా.. పార్టీ పరంగా.. ప్రధాన్యతాంశాలను తీసుకుని ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఇంతటి బృహత్తరమైన ప్రగతి సాధన దిశగా రాష్టప్రాలన పరుగులు పెడుతోంటే.. ప్రతిపక్ష పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ విమర్శలు చేయటం సరైంది కాదని ఆయన అన్నారు. విలేఖరుల సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర, బందరు ఎంపి కొనకళ్ళ నారాయణరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, తదితరులు పాల్గొన్నారు.