ఆంధ్రప్రదేశ్‌

‘కియా’కు త్వరగా అనుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 24: కియా మోటార్స్ స్థాపనకు అవసరమైన అనుమతులు అన్నీ త్వరగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో కియా మోటార్స్‌కు సంబంధించి అనంతపురంలో కేటాయించిన భూముల చదును, నీరు, విద్యుత్ వంటి వౌలిక సదుపాయాలు ఏర్పాటు తదితర అంశాలను సమీక్షించారు. అనంతపురం కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కియా మోటార్స్‌కు కేటాయించిన భూమి చదును పనులను వీడియో ద్వారా వీక్షించి ఆదేశాలు జారీ చేశారు. అనుమతులన్నీ కూడా అనుకున్న సమయానికన్నా ముందే జారీ చేయాలన్నారు. ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్, నీరు, రోడ్లు వంటి వౌలిక సదుపాయాలు భవిష్యత్తులో ఆ ప్రాంతంలో రాబోయే ప్రాజెక్టులను దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రణాళికల ప్రకారం పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు. రియల్ టైం గవర్నెన్స్ సీఈవో బాబు ఎ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సైట్‌లో జరుగుతున్న పనులను ముఖ్యమంత్రికి వివరించారు. కియా మోటార్స్ వారు కోరిన విధంగా శిక్షణ కేంద్రం, టౌన్‌షిప్ నిర్మాణం కోసం భూమి గుర్తించామని, ఒకటి రెండు రోజుల్లో వారికి భూమి కేటాయిస్తామని బాబు ఎ తెలిపారు. వీటి నిర్మాణానికి అవసరమైన ప్రాథమిక పనులను ప్రారంభించుకోవచ్చని వివరించారు. కియా మోటార్స్‌కు కేటాయించిన భూమిలో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి వీలుగా ఇంజనీర్లతో కైజాలా యాప్‌లో ఓ గ్రూప్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ట్రక్ టెర్మినల్, రైల్వే పార్కింగ్‌కు భూమిని గుర్తించామన్నారు. స్మార్ట్ వాటర్ డ్రైనేజీ నిర్మాణానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. కియా మోటార్స్ ప్రతినిధులు వారు చేపట్టే పనుల వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. కియా మోటార్స్‌కు కేటాయించిన భూమిలో 14.4 హెక్టార్లభూమి చదును పూర్తి చేశామని, మిషనరీ లేబర్, రోజువారీ పూర్తి చేసిన పనుల వివరాలను అనంతపురం కలెక్టర్ వీరపాండ్యన్ ముఖ్యమంత్రికి వివరించారు. నిర్ణీత సమయం కన్నా ముందుగా పనులు పూర్తయ్యే విధంగా పనులను వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ముఖ్యమంత్రి కార్యదర్శి సాయిప్రసాద్, పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..కియా పరిశ్రమపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు