ఆంధ్రప్రదేశ్‌

చిన్నబోయన స్మార్ట్ సిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 24: స్మార్ట్‌సిటీగా తొలి దశలోనే ఎంపికైన తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరం సమస్యలతో సతమతం అవుతోంది. స్మార్ట్‌సిటీ పర్యవేక్షణ బాధ్యతలను చూడాల్సిన కాకినాడ కార్పొరేషన్‌కు సుమారు ఏడు సంవత్సరాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఈ దుస్థితి వాటిల్లింది. ఫలితంగా కాకినాడ కార్పొరేషన్ పరిపాలన దాదాపుగా స్తంభించింది. కాకినాడను మున్సిపాలిటీ స్థాయి నుండి కార్పొరేషన్ స్థాయికి 2005వ సంవత్సరంలో అప్‌గ్రేడ్ చేశారు. తొలిసారిగా మేయర్, కార్పొరేటర్లకు నిర్వహించిన ఎన్నికలతో అదే సంవత్సరంలో కార్పొరేషన్ ఏర్పడింది. ఐదేళ్ళ పదవీ కాలం పూర్తయిన అనంతరం గత ఏడు సంవత్సరాలుగా ఈ కార్పొరేషన్ ఎన్నికలకు నోచుకోలేదు! ఇదిలావుంటే దాదాపు సుమారు ఏడాది క్రితం కాకినాడను స్మార్ట్‌సిటీగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలి సంవత్సరం ఇందుకు సంబంధించి నిధులను కూడా మంజూరు చేసింది. అయితే ఇంతవరకు స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. స్మార్ట్‌సిటీకి సంబంధించి కన్సల్టెన్సీ ఎంపికలోనే స్థానిక అధికారులు అవకతవకలకు పాల్పడినట్టు స్పష్టమయ్యింది. స్మార్ట్‌సిటీకి కేటాయించిన నిధుల వినియోగం విషయంలోనూ ప్రశ్నించే నాథుడే కరవయ్యాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఇటీవల కోర్టు విధించిన గడువు ప్రకారం కాకినాడ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. తాజా సమాచారం మేరకు రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లకు కోర్టు కేసుల పేరుతో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖంగా లేదని అధికారులు పేర్కొంటున్నారు. 150 సంవత్సరాల చరిత్రను కలిగి, 470 కోట్ల వార్షిక బడ్జెట్ కలిగి, సుమారు 50 లక్షల జనాభా ఉన్న ఈ కార్పొరేషన్ ప్రత్యేకాధికారుల (కలెక్టర్) పాలనలో నడుస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లతో కూడివుంటే పాలక వర్గం అంటూ ఒకటి ఉంటుందనే విషయాన్ని ప్రజలు మరచిపోయే దుస్థితి ఏర్పడింది. ఫలితంగా జవాబుదారీతనం లేక అధికారుల అవినీతికి హద్దుల్లేకుండా పోయింది. ఈ కార్పొరేషన్‌కు హైకోర్టు ఇచ్చిన గడువు ప్రకారం ఇదే నెలలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గత ప్రభుత్వాలు కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పును పాటించకపోవడం, కోర్టు ఇచ్చిన అదనపు గడువును కూడా అమలుచేయకపోవడం వంటి కారణాలతో ఎన్నికలు అనేకసార్లు వాయిదా పడ్డాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఈ కార్పొరేషన్‌లో సమస్యలు తీవ్రస్థాయికి చేరాయి. 2004 నుండి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సిన ఆస్తి పన్ను, కుళాయి పన్నులు అపరాధ రుసుంతో కలిపి సుమారు 37 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి.