ఆంధ్రప్రదేశ్‌

సుదీర్ఘ తీరం.. ప్రగతికి వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 3: మలేసియా, సింగపూర్, జపాన్ వంటి దేశాలకు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం అతి దగ్గరగా ఉందని, భౌగోళికంగా దేశం మధ్యలో ఉండటం అన్ని వైపులకు రవాణాకు రాష్ట్రం అనుకూలమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, విభజన అనంతరం రాష్ట్రంలోని వనరులను కూడగట్టుకుని అభివృద్ధి కేంద్రంగా పాలనా వ్యవహారాలను వినూత్న పంధాలో ముందుకు నడిపిస్తున్నామని చెప్పారు. స్థానిక గేట్‌వే హోటల్‌లో మంగళవారం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి బోర్డు నిర్వహించిన పెట్టుబడుల సదస్సు సందర్భంగా మలేసియా అంతర్జాతీయ వాణిజ్యం పరిశ్రమల మంత్రి ముస్త్ఫా మహమ్మద్, ఆ దేశ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతం అభివృద్ధిలో కీలకపాత్ర వహించనుందన్నారు. గతంలో అమరావతి దక్షిణాసియా దేశాలకు లాజిస్టిక్ హబ్‌గా వుండేదన్నారు. తీర ప్రాంతాల్లో అభివృద్ధి రేటు సాధారణ వృద్ధి కన్నా 5 రెట్లు అదనంగా వుంటుందని అధ్యయనంలో తేలిందన్నారు. రాష్ట్రంలో పౌర సేవలతో సహా, అన్ని వౌలిక సదుపాయాలు, అమరావతి రాజధాని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించేందుకు తాము సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున వినియోగిస్తున్నామన్నారు. ‘బాండ్ విడ్త్ కనెక్టవిటి’ని రాష్ట్రంలో అన్ని ఇళ్లకు అనుసంధానిస్తున్నామన్నారు. దీనివల్ల ప్రతి ఇంటికి సుమారు 15 ఎంబిపిఎస్ సామర్ధ్యం కలిగిన ఇంటర్‌నెట్ (అంతర్జాలం) విస్తరించడం జరుగుతోందన్నారు. ఇందుకు కేటాయించిన నిధుల్లో కేవలం (8 శాతం) 330 కోట్లు ఖర్చుచేసి ఈ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఇందువల్ల సాంకేతిక విప్లవాన్ని ప్రజా బాహుళ్యంలోనికి ప్రవేశ పెడుతున్నామన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత చౌకగా ఇస్తున్న సౌకర్యం అని ముఖ్యమంత్రి వివరించారు. తద్వారా ఇంటర్‌నెట్ వినియోగించి కరెంటు మీటరు రీడింగ్ వంటి ప్రభుత్వం కల్పిస్తున్న అనేక సౌకర్యాలకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్ ద్వారా తెలుసుకునే వీలుంటుందన్నారు. ఆయా సౌకర్యాలకు పౌరులు చెల్లించాల్సిన బిల్లులు నేరుగా ప్రభుత్వ ఖాతాకు జమ చేయగలుగుతారన్నారు. దీనివల్ల సమయం ఆదా అవడంతో పాటు వివిధ అవసరాలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం వుండదన్నారు. ఇటువంటి విధానం అయిన జనధన్, ఆధార్, మొబైల్ పద్ధతిలో, ఉపాధి హామీ కూలీలు తమ వేతనాలను ఎక్కడ నుండైనా డ్రా చేసుకునే సౌకర్యం కల్పించామన్నారు.
భారత పరిశ్రమల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రతినిధి ప్రసాద్ మాట్లాడుతూ మలేసియా భారతదేశంలో వాణిజ్య సంబంధాలు కలిగివున్న మూడవ అతి పెద్ద దేశమన్నారు. ప్రతి ఏటా 9 లక్షల మంది భారతీయ టూరిస్టులు మలేసియా సందర్శిస్తున్నారన్నారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య పర్యాటక రంగంలో అవగాహన ఒప్పందం వుందన్నారు. నూతన రాష్ట్రంలో వున్న అపరిమిత అవకాశాలను వినియోగించుకుని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలన్నారు.
సమావేశంలో రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి కరికాలవలవన్, మలేషియాకు చెందిన వౌలిక వసతుల ఏవియేషన్ వంటి రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీల నుంచి 40 మంది ప్రతినిధులు, భారత పరిశ్రమల సమాఖ్యకు చెందిన సుమారు 40 కంపెనీల సిఇవోలు, మేనేజింగ్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
chitram..
మలేసియా ప్రతినిధులతో సమావేశమైన చంద్రబాబు