ఆంధ్రప్రదేశ్‌

నీట్ 30వ ర్యాంకర్‌కు సిఎం అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 26: నీట్‌లో అఖిల భారత స్థాలో 30వ ర్యాంక్ సాధించిన అడుసుమిల్లి హేమంత్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ఉండవల్లిలోని నివాసంలో తండ్రి ఎవికె ప్రసాద్‌తో హేమంత్ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తెలంగాణలో 3వ ర్యాంక్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నాలుగో ర్యాంక్ సాధించడంపై అభినందించారు
గుడ్లవల్లేరు రైతుల కృతజ్ఞతలు
నదుల అనుసంధానం ద్వారా పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు సకాలంలో నీరు అందించిందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గుడ్లవల్లేరు మండల రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఉండవల్లిలో సిఎంను సోమవారం రైతులు కలిశారు. రెండు సంవత్సరాలుగా కృష్ణాడెల్టా రైతాంగానికి నీరు అందించినందుకు త్వరలో ఏర్పాటు చేయనున్న కృతజ్ఞత సభకు రావారని సిఎంను కోరారు. కార్యక్రమానికి హాజరయ్యే అంశంపై తరువాత చెబుతానని సిఎం తెలిపారు.

రోగులకు ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులు

* అక్టోబర్ 24 నుంచి అమలు

విజయవాడ, జూన్ 26: ఇకపై రోగులు తమకు సంబంధించిన మెడికల్ రికార్డులను మోసుకువెళ్లే పరిస్థితి తప్పనుంది. త్వరలో ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు ద్వారా ప్రిస్క్రిప్షన్లు, మెడికల్ రిపోర్టుల ఫైళ్లను తమ వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు.
కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సహకారంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు మాడ్యూల్‌ను అభివృద్ధి చేసింది. ఈ మాడ్యూల్‌ని రాష్ట్రంలో అమలు చేయాలని కేంద్రం కోరింది. దీంతో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు విధానాన్ని రాష్ట్రంలో అక్టోబర్ 24 నుంచి అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వివిధ ఆసుపత్రుల్లోని అన్ని విభాగాలను ఒక నెట్‌వర్కు కిందకు తీసుకురానున్నారు. ఒక రోగికి సంబంధించిన అన్ని వివరాలను డిజిటల్ లాకర్ రూపంలో ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డును రూపొందిస్తారు. ఈ సమాచారాన్ని వివిధ ఆరోగ్య పథకాల వర్తింపు, ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్య రక్ష పథకాల సమయంలో వినియోగించుకుంటారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్య వివరాలను డిజిటల్ రూపంలో పొందుపరిచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ విధానం అమలు చేయనుంది. ఇందుకు అవసరమైన హార్డ్‌వేర్ ఇప్పటికే చాలా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంది. బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో కావాల్సిన పరికరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనుంది. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు విధానం అమలు చేసేందుకు వీలుగా ఉన్నతాధికారులతో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఏడాది జూలై 30 నాటికి ఈ మాడ్యూళ్ల టెస్టింగ్ పూర్తి చేయనుంది. సెప్టెంబర్ 30 నాటికి హార్డ్‌వేర్ ఏర్పాటు, శిక్షణ, అనుసంధానం పూర్తి చేయనుంది. ఆస్ట్రేలియాకు చెందిన స్టేట్ ఆఫ్ విక్టోరియా ఇందుకు సహకరించనుంది.

జగన్ కోసమే పాదయాత్రలు
ముద్రగడపై కాపు కార్పొరేషన్ చైర్మన్ ధ్వజం

విజయవాడ, జూన్ 26: కాపులు కోరని వరాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమలు చేస్తుంటే ముద్రగడ పద్మనాభం మాత్రం ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డిని బలపరిచేందుకు పాదయాత్ర చేస్తున్నారంటూ కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ మండిపడ్డారు. కాపుల సంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా పాదయాత్ర చేయడాన్ని ఏ కాపు, బలిజ, ఒంటరి తెలగ కూడా హర్షించబోరని సోమవారం ఒక ప్రకటనలో రామానుజయ ధ్వజమెత్తారు. కాపుల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం చేసినంత కృషి గత 70 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేశాయా అని ప్రశ్నించారు. మూడేళ్లలో కాపు కార్పొరేషన్‌కు రూ.2,100 కోట్లపైన కేటాయించారన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కాపులను ఓటు బ్యాంకుగానే పరిగణించాయన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లోనూ కాపులకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రిజర్వేషన్ అంశంపై తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోందన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం కాపులను బిసిల్లో చేర్చేందుకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇప్పటికే అధికారులను ఆదేశించారన్నారు. ఈ నివేదిక తయారు చేసేందుకు సమన్వయం కోసం మంత్రుల బృందాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. జగన్మోహన్‌రెడ్డి, రఘువీరారెడ్డి ఉచ్చులో చిక్కుకుని పాదయాత్రల పేరుతో కాపులకు నష్టం చేకూర్చే విధంగా ముద్రగడ వ్యవహరిస్తున్నారని అన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ఆనాటి వైఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారా అన్నారు. కాపుల రిజర్వేషన్లకు కృషిచేస్తున్న ముఖ్యమంత్రిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. గతంలో తునిలో బహిరంగ సభకు అనుమతి ఇస్తే రైలు బోగీలను తగులబెట్టి సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించారన్నారు. ఇప్పుడు పాదయాత్రకు అనుమతి తీసుకోవడానికే నిరాకరిస్తూ చట్టానే్న ధిక్కరిస్తున్నారన్నారు.

ఐఎఎస్ అధికారి శ్రీలక్షి జైలుపాలైనప్పుడు
ఏమైంది మీ ఆత్మగౌరవం

*ఐవైఆర్ చంద్రబాబును భయపెట్టాలనుకుంటున్నారా?
*బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద సూర్య సూటిప్రశ్న
విజయవాడ (క్రైం), జూన్ 26: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన మీరు కోట్లు దోచుకుంటే ఫలితంగా బ్రాహ్మణ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ జైలుపాలయినప్పుడు ఏమైంది మీ ఆత్మగౌరవం అంటూ వైఎస్సార్ పార్టీ నేతలను బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య సూటిగా ప్రశ్నించారు. మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు తన వ్యాఖ్యలతో ప్రభుత్వాన్ని, చంద్రబాబును భయపెట్టాలనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. త్వరలో భ్రాహ్మణ కార్పొరేషన్ ప్రణాళిక ప్రకటిస్తామని ఆనందసూర్య చెప్పారు. విజయవాడలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసిపి నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉండి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న వ్యక్తిని వెంటనే తొలిగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. ఈక్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఐవైఆర్ కృష్ణారావును తొలిగించారని, అయితే దీంతో బ్రాహ్మణ ఆత్మగౌరవం దెబ్బతిన్నందంటూ వైసిపి పార్టీ నేతలు, ఎమ్మెల్యే కోనా రఘుపతి గుంటూరులో బ్రాహ్మణ ఆత్మ గౌరవ సభ నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ జైలుపాలై ఇబ్బందులు పడినప్పుడు ఏమయ్యారు వీరంతా.. ఏమైంది అప్పుడు బ్రాహ్మణ ఆత్మగౌరవం అని నిలదీశారు. బ్రాహ్మణులను ఇప్పటి వరకు పని చేసిన ప్రభుత్వాలేవీ ఆదుకున్న పాపాన పోలేదన్నారు. ప్రధాని నుంచి ముఖ్యమంత్రి వరకు ఎంతోమంది బ్రాహ్మణులు పని చేసినా తమను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. అలాంటిది చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే తమను బాగు కోసం బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 210 కోట్లు నిధులు కేటాయించారన్నారు. కార్పొరేషన్ ద్వారా రుణాలు, స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నారన్నారు. పేద బ్రాహ్మణులు ఉండకూడదని సీఎం కృషి చేస్తున్నారన్నారు. కుల రాజకీయాలు చేస్తున్న వైసిపి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఇక ఐవైఆర్ కృష్ణారావు ప్రస్తావన రాగానే దొనకొండలో ఆయనకు ఆస్తులున్న విషయంపై మాట్లాడే స్థాయి తనది కాదన్నారు. ఆయన తన వ్యాఖ్యలతో ప్రభుత్వాన్ని భయపెడతారా.. లేక చంద్రబాబు భయపడే వ్యక్తా అని ప్రశ్నించారు.

నేటి నుంచి 4 రోజులపాటు
వస్త్ర దుకాణాలు బంద్
*జిఎస్‌టి రద్దు చేయకుంటే నిరవధికంగా మూత
*ఏపి టెక్స్‌టైల్ ఫెడరేషన్ చైర్మన్ బూసిరెడ్డి

విజయవాడ, జూన్ 26: వస్త్ర వ్యాపార రంగంపై జిఎస్‌టిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా వస్త్ర వ్యాపారులు చేస్తున్న ఆందోళనలో భాగంగా ఈనెల 27 తేదీ నుంచి 30వ తేదీ వరకు నాలుగు రోజులపాటు వస్త్ర దుకాణాలు మూతబడనున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే దాదాపు 20వేల వస్త్ర దుకాణాలు ఈ బంద్‌లో పాల్గొంటున్నాయి. 30తేదీ అన్ని దుకాణాల ఎదుట నల్లజెండాలతో నిరసన తెలుపుతామని, అప్పటికీ కేంద్రం దిగి రాకుంటే నిరవధిక బంద్‌కు సైతం సిద్ధంగా ఉన్నామని ఏపి టెక్స్‌టైల్ ఫెడరేషన్ చైర్మన్ బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి ఆంధ్రభూమి ప్రతినిధితో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా వస్త్ర రంగంపై కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టి విధించడం అత్యంత దారుణమన్నారు. వస్త్ర రంగం దీనివల్ల మరింత కుదేలవుతుందన్నారు. జిఎస్‌టి వల్ల దేశవ్యాప్తంగా వస్త్ర రంగంపై ఆధారపడ్డ 25 కోట్ల మంది రోడ్డున పడతారన్నారు. గతంలో వస్త్ర వ్యాపారుల పట్ల సానుభూతి చూపించిన సిఎం చంద్రబాబు ఇంతటి తీవ్రమైన విషయంలో ఏ మాత్రం స్పందించకపోవటం ఎంతో బాధాకరమన్నారు.

నేడు భోపాల్‌కు లోకేష్

గుంటూరు, జూన్ 26: రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటిశాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం భోపాల్‌లో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి తోమర్ అధ్యక్షతన భోపాల్‌లో అన్ని రాష్ట్రాల పంచాయతీరాజ్‌శాఖ మంత్రుల సదస్సు జరగనుంది. సదస్సుకు హాజరైన అనంతరం బుధవారం ఢిల్లీ చేరుకుంటారు. ఐటి పెట్టుబడులు, గ్రామీణాభివృద్ధి తదితర అంశాలపై చర్చించటంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల సమీకరణ తదితర అంశాలపై పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.