ఆంధ్రప్రదేశ్‌

బ్రాహ్మణులు సంఘటితం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 25: రాష్ట్రంలో బ్రాహ్మణుల అణచివేత చర్యలకు నిరసనగా హక్కుల సాధనకోసం సంఘటితం కావాలని నేతలు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా డిసెంబర్‌లో లక్ష మందితో భారీగా ఆత్మగౌరవ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. ఆదివారం గుంటూరు నగరంలోని వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బ్రాహ్మణ ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ సభలో రఘుపతి మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుండి సీనియర్ ఐఎఎస్ విశ్రాంత అధికారి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును అక్రమంగా తొలగించారని దుయ్యబట్టారు. విజయవాడ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ఐవైఆర్ కృష్ణారావు అక్రమ తొలగింపుతో బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. టిడిపి అధికార వెబ్‌సైట్‌లో ఐవైఆర్ కృష్ణారావుపై అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టారని, ఈ విషయంపై డిజిపికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎపి బ్రాహ్మణ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి పోతాజ్జుల పురుషోత్తమ శర్మ మాట్లాడుతూ ఏటా రూ.500 కోట్లు కేటాయిస్తామన్న తెలుగుదేశం ప్రభుత్వం ఈ మూడేళ్లలో కేవలం రూ. 132 కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమన్నారు.

చిత్రం.. బ్రాహ్మణ ఆత్మగౌరవ సభలో సంఘీభావం ప్రకటిస్తున్న నేతలు