ఆంధ్రప్రదేశ్‌

ఆవు మృతితో వాగు నీరు కలుషితం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 26: గిరిజన తండాల్లో సంభవిస్తున్న మరణాలపై సాంఘిక, గిరిజన సంక్షేమ మంత్రి నక్కా ఆనందబాబు వివరణ ఇచ్చారు. వాగులో ఆవు చనిపోవడం వల్ల ఆ నీళ్ళు కలుషితం కావటమే రోగాలకు కారణమన్నారు. మరణాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి, గత రెండురోజుల నుంచి వైద్యపరంగా తగిన చర్యలు తీసుకుంటోందన్నారు. గిరిజనులకు కనీస అవగాహన లేకపోవటంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. విజయవాడలోని ప్రభుత్వ అతిధి గృహంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రంపచోడవరం చాపరాయిలో బాధితులను పరామర్శించామన్నారు. 32మంది రంపచోడవరం ఆస్పత్రిలో డయేరియా, విష జ్వరాలు సోకి చికిత్స పొందుతున్నారని, నలుగురి పరిస్ధితి విషమంగా ఉన్నందున కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. సత్వరమే స్పందించి రెండు ప్రత్యేక వైద్య బృందాలు పంపామన్నారు. గతనెలలో స్థానికులు ఒక ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు ఆహారం కలుషితం కావటం ఒక కారణం కాగా, వాగులో ఆవు చనిపోవడం వల్ల ఆ నీళ్ళు కలుషితం అయ్యాయని చెప్పారు. ఒక్కొక్క పంచాయితీ కింద 40 ఆవాసాలు ఉంటున్నాయని, ఇందులో 70 ఇళ్లలో 375 మంది వరకు గిరిజనులు కనీస అవగాహన లేకుండా, వైద్యం చేయించుకోవాలనే ఆలోచన కూడా లేక జీవిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సత్వరమే స్పందించి చనిపోయిన ఒక్కొక్కరికి ఐదు లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియో ప్రకటించారన్నారు. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా తీర్చదిద్దనున్నట్లు తెలిపారు.
చింతూరుని ఏరియా ఆస్పత్రిగా ముఖ్యమంత్రి ప్రకటించారని, జిల్లా కలెక్టర్, ట్రైబల్ ఏరియా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. గిరిజన తండాలో తాగునీరు అందించేందుకు పంచాయితీరాజ్ మంత్రి లోకేష్ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గిరిజన తండాలో 12మంది వైద్యాధికారులను నియమించేందుకు టిఎస్‌పి నిధులతో అంబులెన్స్‌లు కొనుగోలుకు 2.75కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గంగపర్రులో రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణలపై ప్రభుత్వం సున్నితమైన సమస్యగా భావించినందున స్థానికంగానే పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో ఉందన్నారు. దీనిపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ఎక్సైజ్ మంత్రి జవహర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ మంగళవారం గరగపర్రు సందర్శిస్తారని తెలిపారు.

చిత్రం.. విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి నక్కా ఆనందబాబు