ఆంధ్రప్రదేశ్‌

పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో తగ్గనున్న సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 26: పాస్‌పోర్టు సేవా కేంద్రాల (పిఎస్‌కె) సేవలు ఇక ఇక నుంచి తగ్గనున్నాయి. వీటి కార్యకలాపాలు క్రమేపీ తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేంద్రాల ద్వారా అభ్యర్థులకు అందుతున్న సేవలకు సంబంధించి పిర్యాదులు వెల్లువెత్తున పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం పారదర్శకంగా వీటిని అందివ్వాలని నిర్ణయించింది. అలాగే సేవలు మరింతగా విస్తరించడం, వేగవంతం చేయడం కోసం పోస్ట్ఫాసుల ద్వారా ఈ సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఇపుడు దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభమైంది. తొలి దశలో హెడ్‌పోస్ట్ఫాసుల్లో పాస్‌పోర్టు సేవలు ప్రారంభమవుతాయి. ఈ విధంగా ఎపిలో ఏడు జిల్లాలకు చెందిన హెడ్ పోస్ట్ఫాసుల్లో పాస్‌పోర్టు సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ విధంగా అందించే సేవల కోసం ప్రభుత్వ ఉద్యోగిని వెరిఫికేషన్ ఆఫీసర్‌గా నియమిస్తారు. మరో ఉద్యోగిని ప్రైవేటు సంస్థ అయిన పిఎస్‌కెల నుంచి తీసుకుంటారు. వీరద్దరి ద్వారా రోజుకు వంద దరఖాస్తులు అభ్యర్థుల నుంచి స్వీకరిస్తారు. ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకునే అభ్యర్థుల దరఖాస్తుల వివరాలు హెడ్‌పోస్ట్ఫాసులకు చేరుతాయి. ఈ విధంగా చేరే వాటిలో ధ్రువపత్రాలు, దరఖాస్తుల పరిశీలన, ఫొటోలు, వేలిముద్రలు తీసుకోవడం వంటి కార్యక్రమాలన్నింటినీ ఇక్కడ పూర్తిచేస్తారు. దీనివల్ల పిఎస్‌కెల్లో పని వత్తిడి తగ్గడంతోపాటు, వీటి ద్వారా అందే సేవలను పోస్ట్ఫాసుల ద్వారా పారదర్శకంగా అందించినట్టు అవుతుందని కేంద్రం భావిస్తోంది. అయితే అభ్యర్థుల నుంచి తీసుకునే దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి కొన్ని పరిమితులు పెట్టనుంది. నియమనిబంధనల ప్రకారం హెడ్‌పోస్ట్ఫాసులకు చేరే దరఖాస్తులన్నింటినీ పరిశీలించిన మీదట సకాలంలో అభ్యర్థులకు పాస్‌పోర్టులు అందించే విధంగా చర్యలు తీసుకుంటారు. ఎపిలో రాజమండ్రి, భీమవరం, శ్రీకాకుళం, చిత్తూరు, విశాఖపట్నం, గుంటూరు జిల్లాలకు చెందిన హెడ్ పోస్ట్ఫాసుల ద్వారా పాస్‌పోర్టు సేవలు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించేందుకు కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించనుంది. కాగా ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ద్వారా అందుతున్న సేవలు మరింతగా విస్తృత పర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.