ఆంధ్రప్రదేశ్‌

మొదటి ఘాట్‌లో రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 26: శ్రీవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణమైన కర్ణాటకు చెందిన భక్తులు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో సోమవారం సాయంత్రం వి ఎస్ టి వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. బ్రేకులు ఫెయిల్‌కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా ఈప్రమాదంలో వాహనం బాగా దెబ్బతిన్నప్పటికీ అందులో ఉన్న ప్రయాణికులు మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డారు. గాయపడ్డవారిని స్థానికా అశ్విని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు.
600 కిలోల గంజాయి పట్టివేత
జామి, జూన్ 26: విజయనగరం జిల్లా జామి మండలం జాగరం గెడ్డ వంతెన దాటి లక్ష్మీపురం జంక్షన్ వద్ద సోమవారం తెల్లవారుజామున భారీ గంజాయితో వ్యాన్‌ను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న విషయమై జామి ఎస్సై రాజు, సిబ్బంది పహరా కాస్తున్న సమయంలో అనుమానాస్పదంగా వ్యాన్ ఒకటి కనిపించింది. వ్యాన్‌ను పట్టుకోమని ఎస్సై కానిస్టేబుల్ దేవుడుకు ఆదేశించగా వెంబడించి పట్టుకున్నారు. దీంతో డ్రైవర్ వ్యాన్‌ను విడిచిపెట్టి పరారయ్యాడు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 20 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసుల అంచనా. సమాచారం అందుకున్న సిఐ రమణమూర్తి అక్కడికి చేరుకున్నారు. వ్యాన్‌లో 28 గంజాయి బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో బస్తాలో 30 కేజీల గంజాయి ఉంటుందని చెబుతున్నారు. వ్యాన్ డ్రైవర్, గంజాయి మూట యజమాని ఆచూకీ తెలియకుండా ఎటువంటి వివరాలు ఇవ్వలేమని పోలీసులు తెలిపారు. సిఐ రమణమూర్తికి వివరాల కోసం ఫోన్ చేయగా అటువంటి వ్యాన్ ఏమి పట్టుకోలేదని చెప్పడం గమనార్హం.
చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

తిరుపతి, జూన్ 26: గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో పలు రాష్ట్రాల్లో వివిధ రకాల దొంగతనాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఇరానీ దొంగల ముఠాను చిత్తూరు పోలీసులు సోమవారం అరెస్ట్‌చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఆమె విలేఖరులతో మాట్లాడుతూ తిరుచానూరు సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న ఒక వాహనాన్ని ఆపి సోదా చేయగా అందులోని వారు పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు వెంబడించి పట్టుకుని అదుపులోకి తీసుకున్నారన్నారు. వారిని ప్రశ్నించగా జిల్లా పలుచోట్ల చోరీలు చేసినట్టు అంగీకరించారన్నారు. కాగా ఇరానీ ముఠాకు చెందిన వారు 9 మందని విచారణలో తేలిందన్నారు. వీరిలో నలుగుర్ని అరెస్టుచేశామన్నారు. మిగతావారి కోసం గాలిస్తున్నామన్నారు. వీరి వద్ద నుంచి రూ.50 లక్షలు విలువచేసే బంగారుచైన్లు, ఇండిగోకారు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు పంపించామన్నారు.