ఆంధ్రప్రదేశ్‌

ఏకాభిప్రాయ సాధనకు ప్రపంచ యాత్ర చేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, జూన్ 26: కాపులను బిసిల్లో చేర్చడానికి ఏకాభిప్రాయ సాధన పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రపంచయాత్ర చేస్తారా? అని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఎద్దేవాచేశారు. మంజునాథ్ కమిషన్ నివేదిక తెప్పించుకుని, క్యాబినెట్‌లో, పార్టీ సమావేశంలో, ప్రజలతో, బిసి నేతలతో చర్చించి, నూరు శాతం ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటామని విశాఖ మహానాడులో ముఖ్యమంత్రి ప్రకటించారని, దక్షిణాది రాష్ట్రాలతోపాటు దేశమంతటా పర్యటించి, నిర్ణయం చేస్తానని చెప్పి ఉంటే బాగుండేదని ముద్రగడ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల సాధన కోసం జూలై 26న కిర్లంపూడి నుంచి అమరావతికి తాను తలపెట్టిన నిరవధిక పాదయాత్ర రూట్ మ్యాప్‌ను ముద్రగడ పద్మనాభం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో సోమవారం విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ మొత్తం నాలుగు జిల్లాల పరిధిలో 116 గ్రామాల మీదుగా పాదయాత్ర జరిగేలా షెడ్యూలును రూపొందించామన్నారు. కిర్లంపూడిలో జూలై 26న ప్రారంభించే యాత్ర వీరవరం, జగ్గంపేట మీదుగా మొత్తం 22 గ్రామాల మీదుగా రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్‌కు చేరుకుంటుందన్నారు. అక్కడ నుంచి రోడ్ కం రైలు బ్రిడ్జి మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశించి 53 గ్రామాల్లో సాగుతుందన్నారు. కృష్ణా జిల్లాలో కలిదిండి మీదుగా 35 గ్రామాల్లో, గుంటూరు జిల్లాలో సీతానగరం మీదుగా వెలగపూడి, అమరావతి వరకూ ఆరు గ్రామాల్లో నిరవధిక పాదయాత్ర జరుగుతుందని ముద్రగడ వివరించారు. ఏ తేదీన ఏ గ్రామంలో పాదయాత్ర అనేది మాత్రం ప్రకటించలేదు. కాగా రూట్ మ్యాప్‌ను తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముద్రగడ ఒక లేఖ రాశారు. పాదయాత్రకు అనుమతి లేదని పదేపదే చెప్పిస్తున్నారని, ఇంతకు ముందు జరిగిన పాదయాత్రలకు అనుమతులు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. ఏకాభిప్రాయ సాధన విషయం మేనిఫెస్టోలో ప్రకటించినపుడు, ఎన్నికల ప్రచార సభల్లో ఎందుకు గుర్తుకురాలేదని ప్రశ్నించారు. 1993-94లో ప్రారంభమైన తమ రిజర్వేషన్ల ఉద్యమంలో ఏనాడూ బిసి సోదరులు అనుభవించే కోటాలో వాటా కావాలని కోరలేదని, ఎ, బి, సి, డి, ఇ గ్రూపుల్లో కూడా ఇవ్వబోయే రిజర్వేషన్ పెట్టవద్దని, ప్రత్యేక కేటగిరి పెట్టి ఇవ్వమని అడుగుతున్నామన్నారు.